మారుతి సుజుకి డిజైర్

మారుతి సుజుకి డిజైర్
Style: సెడాన్
6.09 - 9.13 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

మారుతి సుజుకి ప్రస్తుతం 7 విభిన్న వేరియంట్లు మరియు 6 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. మారుతి సుజుకి డిజైర్ ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, మారుతి సుజుకి డిజైర్ ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా మారుతి సుజుకి డిజైర్ మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి మారుతి సుజుకి డిజైర్ గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

మారుతి సుజుకి డిజైర్ పెట్రోల్ మోడళ్లు

మారుతి సుజుకి డిజైర్ మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
పెట్రోల్ 24.12

మారుతి సుజుకి డిజైర్ రివ్యూ

Rating :

మారుతి సుజుకి డిజైర్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

మారుతి సుజుకి డిజైర్ రివ్యూ

మారుతి సుజుకి డిజైర్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ మారుతి డిజైర్ కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే ఫ్రంట్ ఎండ్ డిజైన్‌తో సొగసైన డిజైన్‌ని కలిగి ఉంటుంది. మారుతి డిజైర్ (స్విఫ్ట్ డిజైర్) యొక్క మునుపటి మోడల్ తో పోలిస్తే, సరికొత్త మోడల్ దాని వెనుక భాగంలో లగేజ్ కంపార్ట్మెంట్ ఉన్న హ్యాచ్‌బ్యాక్ కాకుండా సరైన కాంపాక్ట్-సెడాన్ లాగా కనిపిస్తుంది. కాంపాక్ట్-సెడాన్ యొక్క ముందు ప్రొఫైల్‌లో క్రోమ్ ఇన్సర్ట్‌లతో కొత్త హెక్సాగోనల్ గ్రిల్, కొత్తగా రూపొందించిన హెడ్‌ల్యాంప్‌లు మరియు బ్లాక్-అవుట్ ఫాగ్ లాంప్ హౌసింగ్‌తో పునరుద్ధరించిన బంపర్ ఉన్నాయి.

స్విఫ్ట్ డిజైర్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లతో కొత్త అల్లాయ్ వీల్స్ మరియు ORVM లను కూడా పొందుతుంది. మారుతి డిజైర్ యొక్క వెనుక ప్రొఫైల్ కొత్త టెయిల్ లాంప్ క్లస్టర్‌ను కలిగి ఉంది. మొత్తం డిజైన్ మంచిదిగా కనిపిస్తుంది. కారును నాలుగు మీటర్ల లోపు తీసుకురావడానికి లెంత్ కట్టింగ్ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

మారుతి డిజైర్ ఇంటీరియర్స్ కొన్ని వుడెన్ పానల్స్ బ్లాక్ మరియు బీజ్ కలర్ మూలకాల మిశ్రమంగా ఉంటుంది. ఇది లేటెస్ట్ స్విఫ్ట్ తరం మీద ఆధారపడి ఉన్నప్పటికీ, డిజైర్ యొక్క డాష్‌బోర్డ్ హ్యాచ్‌బ్యాక్‌కు భిన్నంగా ఉంటుంది. ఎసి వెంట్స్ దగ్గర-ట్రాపెజియం డిజైన్‌ను అనుసరిస్తాయి మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పైన ఉంటుంది. స్టీరింగ్, ఫ్లాట్-బాటమ్ యూనిట్ చాలా చక్కగా ఉంటుంది. మొత్తంమీద ఇంటీరియర్స్ కంటికి చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తాయి.అంతే కాకుండా ప్రయాణికులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

మారుతి సుజుకి డిజైర్ ఇంజన్ మరియు పనితీరు

మారుతి సుజుకి డిజైర్ ఇంజిన్ మరియు పెర్ఫామెన్స్

మారుతి డిజైర్ ప్రస్తుతం ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజిల్ 4-సిలిండర్ ఇంజన్లతో పనిచేస్తుంది. పెట్రోల్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 82 బిహెచ్‌పి మరియు 4200 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 74 బిహెచ్‌పి మరియు 2000 ఆర్‌పిఎమ్ వద్ద 190 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి.

మారుతి సుజుకి డిజైర్ ఇంధన సామర్థ్యం

మారుతి సుజుకి డిజైర్ ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ

మారుతి డిజైర్ పెట్రోల్ వేరియంట్‌ 22 కి.మీ / లీ మరియు డీజిల్‌ వేరియంట్ 28.4 కి.మీ / లీ మైలేజ్ అందిస్తుంది. ముఖ్యంగా డీజిల్ డిజైర్, లాంచ్ సమయంలో కాంపాక్ట్-సెడాన్ విభాగంలో ఒక బెంచ్ మార్క్. మారుతి డిజైర్ నగరంలో మరియు హైవేలో కూడా మంచి పనితీరును ప్రదర్శిస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ మాన్యువల్‌తో పోలిస్తే తక్కువ ఇంధన శక్తిని ఇవ్వగలదు.

మారుతి సుజుకి డిజైర్ ముఖ్యమైన ఫీచర్లు

మారుతి సుజుకి డిజైర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ 

మారుతి డిజైర్ తన ప్రత్యర్థులకు మంచి పోటీనిచ్చేంత ఫీచర్స్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే మరియు మిర్రర్‌లింక్‌లతో 7 ఇంచెస్ స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటివి డిజైర్ లో మనం చూడవచ్చు. ఈ కాంపాక్ట్-సెడాన్ లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, రియర్ ఎసి వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVM లు మరియు 10-స్పోక్ 15-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ యొక్క చక్కని సెట్ పొందుతుంది.

మారుతి డిజైర్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ గమనిస్తే ఇందులో డ్యూయల్-ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎబిడి విత్ ఇబిడి, బ్రేక్ అసిస్ట్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు ఉన్నాయి. ఈ అన్ని ఫీచర్స్ మారుతి డిజైర్ పరిధిలో స్టాండర్డ్ గా వస్తాయి. కొత్త మారుతి స్విఫ్ట్ యొక్క టాప్ వేరియంట్లలో రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్లు కూడా ఉన్నాయి.

మారుతి సుజుకి డిజైర్ తీర్పు

మారుతి సుజుకి డిజైర్ వెర్డిక్ట్

మారుతి సుజుకి డిజైర్ భారతదేశం యొక్క అత్యంత ప్రియమైన కాంపాక్ట్-సెడాన్ భారతదేశం యొక్క అత్యంత ప్రియమైన హ్యాచ్‌బ్యాక్ 2013 మారుతి స్విఫ్ట్‌కు తోబుట్టువు. మొదటి-తరం డిజైర్ పుల్ సైజ్ సెడాన్ అయినప్పటికీ, తరువాతి రెండు తరాలు సబ్ ఫోర్ మీటర్ల కాంపాక్ట్ సెడాన్‌గా వచ్చాయి. ఈ కారు ఐదుగురు ప్రయాణీకులను మరియు తగినంత బూట్‌ను మోయగలదు, అదే సమయంలో గట్టి పార్కింగ్ ప్రదేశాలలో కూడా సరిపోతుంది. చిన్న కారు కోసం వెతుకుతున్న చిన్న కుటుంబాలకు డిజైర్ కచ్చితంగా అనువైన కారు.

మారుతి సుజుకి డిజైర్ మారుతి సుజుకి డిజైర్ కలర్లు


Oxford Blue
Phoenix Red
Magma Grey
Premium Silver
Sherwood Brown
Arctic White

మారుతి సుజుకి డిజైర్ పెట్రోల్ కాంపిటీటర్స్

మారుతి సుజుకి డిజైర్ పెట్రోల్ మైలేజ్ కంపారిజన్

  • హోండా సిటీ హోండా సిటీ
    local_gas_station పెట్రోల్ | 17.4
  • హ్యుందాయ్ వెర్నా హ్యుందాయ్ వెర్నా
    local_gas_station పెట్రోల్ | 17.7
  • స్కొడా రాపిడ్ టిఎస్ఐ స్కొడా రాపిడ్ టిఎస్ఐ
    local_gas_station పెట్రోల్ | 18.97

మారుతి సుజుకి మారుతి సుజుకి డిజైర్ ఫోటోలు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X