హ్యుందాయ్ ఆరా

హ్యుందాయ్ ఆరా
Style: సెడాన్
6.00 - 9.36 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

హ్యుందాయ్ ప్రస్తుతం 12 విభిన్న వేరియంట్లు మరియు 5 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. హ్యుందాయ్ ఆరా ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, హ్యుందాయ్ ఆరా ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా హ్యుందాయ్ ఆరా మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి హ్యుందాయ్ ఆరా గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

హ్యుందాయ్ ఆరా పెట్రోల్ మోడళ్లు

హ్యుందాయ్ ఆరా సిఎన్‌జి మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
సెడాన్ | Gearbox
7,66,462

హ్యుందాయ్ ఆరా డీజిల్ మోడళ్లు

హ్యుందాయ్ ఆరా మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
పెట్రోల్ 21
సిఎన్‌జి 28
డీజిల్ 25

హ్యుందాయ్ ఆరా రివ్యూ

Rating :
హ్యుందాయ్ ఆరా Exterior And Interior Design

హ్యుందాయ్ ఆరా ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

హ్యుందాయ్ ఆరా భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క సరికొత్త కాంపాక్ట్-సెడాన్ ఆఫర్. కొత్త హ్యుందాయ్ ఆరా బ్రాండ్ యొక్క గ్రాండ్ ఐ 10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించబడింది. అయితే వీటి మధ్య కొన్ని చిన్న తేడాలు ఉన్నప్పటికీ అదే ఇంజన్ ఎంపికలు మరియు ఫీచర్స్ కలిగి ఉంటాయి.

హ్యుందాయ్ ఆరా డిజైన్ పరంగా, నియోస్ మాదిరిగానే ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంది. ఇది అదే సిగ్నేచర్ క్యాస్కేడింగ్ గ్రిల్‌ను కలిగి ఉంది, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఇరువైపులా ఉంటాయి. హ్యుందాయ్ ఆరా ఇప్పుడు రెండు బూమేరాంగ్ ఆకారంలో ఉన్న ఎల్ఇడి డిఆర్ఎల్ లతో ఒకటి కాకుండా గ్రిల్ యొక్క రెండు చివర్లలో వస్తుంది.

హ్యుందాయ్ ఆరా యొక్క సైడ్ ప్రొఫైల్స్ విషయానికి వస్తే, దీనికి ఇరువైపులా స్టైలిష్ గా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ తో వస్తాయి. కాంపాక్ట్-సెడాన్ బ్లాక్-అవుట్ సి-పిల్లర్ కూడా కలిగి ఉంది. ఆరా యొక్క వెనుక ప్రొఫైల్ చుట్టు టైల్ లైట్స్ మరియు బూట్ లిడ్ మధ్యలో ‘ఆరా’ బ్యాడ్జింగ్‌తో స్పోర్టిగా కనిపిస్తుంది.

హ్యుందాయ్ ఆరా లోపలి వెళ్లే కొద్దీ, ఐ 10 గ్రాండ్ నియోస్‌కు సమానమైన క్యాబిన్‌ను కలిగి ఉంది. ఇందులో డాష్‌బోర్డ్ లేఅవుట్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉన్నాయి. మొత్తంమీద హ్యుందాయ్ ఆరా ప్రీమియంగా కనిపించే ఇంటీరియర్‌లను కలిగి ఉంటుంది.

హ్యుందాయ్ ఆరా ఇంజన్ మరియు పనితీరు

హ్యుందాయ్ ఆరా Engine And Performance

హ్యుందాయ్ ఆరా మూడు ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఇందులో రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 85 బిహెచ్‌పి మరియు 113 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేయగా, 1.2-లీటర్ డీజిల్ యూనిట్ 75 బిహెచ్‌పి మరియు 190 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది. ఇక 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ 100 బిహెచ్‌పి మరియు 172 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేయడానికి డి-ట్యూన్ చేయబడింది.

మూడు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కు స్టాండర్డ్ గా జతచేయబడతాయి. హ్యుందాయ్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలలో 5-స్పీడ్ ఎఎమ్‌టి గేర్‌బాక్స్‌ను కూడా అందిస్తుంది.

హ్యుందాయ్ ఆరా ఇంధన సామర్థ్యం

హ్యుందాయ్ ఆరా Fuel Efficiency

హ్యుందాయ్ ఆరా ARAI- సర్టిఫైడ్ మైలేజ్ ఒక లీటరుకు 20 కి.మీ. అయినప్పటికీ, వివిధ బాహ్య కారకాల వల్ల వాస్తవ ప్రపంచంలో దీని మైలేజ్ 16 నుంచి 18 కి.మీ / లీటర్ మధ్య ఉంటుంది.

హ్యుందాయ్ ఆరా ముఖ్యమైన ఫీచర్లు

హ్యుందాయ్ ఆరా Important Features

హ్యుందాయ్ ఆరా మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా ఇది కనెక్ట్టెడ్ టెక్నాలజీతో ఉంటుంది. హ్యుందాయ్ ఆరాలో 5.2 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ప్లేతో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్లూటూత్ కనెక్టివిటీ, ఆడియో మరియు మౌంటెడ్ కంట్రోల్స్ తో మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి.

ఇక సేఫ్టీ విషయానికి వస్తే హ్యుందాయ్ ఆరాలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఇమ్మొబిలైజర్, హెడ్‌ల్యాంప్ ఎస్కార్ట్ ఫంక్షన్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, ఇంపాక్ట్-సెన్సింగ్ డోర్ అన్‌లాక్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ ఆరా తీర్పు

హ్యుందాయ్ ఆరా Verdict

హ్యుందాయ్ ఆరా చాలా ఆధునిక డిజైన్‌తో వస్తుంది, ఇందులో షార్ప్ లైన్స్ మరియు స్పోర్టి వైఖరి ఉంటుంది. ఇది ఆఫర్‌లో ఉన్న బలమైన పనితీరు గల ఇంజిన్‌లతో కలిపి, ఇది చాలా ఆకర్షణీయమైన సమర్పణగా నిలుస్తుంది.

హ్యుందాయ్ ఆరా హ్యుందాయ్ ఆరా కలర్లు


Titan Grey
Vintage Brown
Typhoon Silver
Fiery Red
Polar White

హ్యుందాయ్ ఆరా పెట్రోల్ కాంపిటీటర్స్

హ్యుందాయ్ ఆరా డీజిల్ కాంపిటీటర్స్

హ్యుందాయ్ ఆరా పెట్రోల్ మైలేజ్ కంపారిజన్

  • హోండా అమేజ్ హోండా అమేజ్
    local_gas_station పెట్రోల్ | 18.3
  • మారుతి సుజుకి డిజైర్ మారుతి సుజుకి డిజైర్
    local_gas_station పెట్రోల్ | 24.12
  • స్కొడా రాపిడ్ టిఎస్ఐ స్కొడా రాపిడ్ టిఎస్ఐ
    local_gas_station పెట్రోల్ | 18.97

హ్యుందాయ్ ఆరా డీజిల్ మైలేజ్ కంపారిజన్

  • హోండా అమేజ్ హోండా అమేజ్
    local_gas_station డీజిల్ | 24.7

హ్యుందాయ్ హ్యుందాయ్ ఆరా ఫోటోలు

హ్యుందాయ్ ఆరా Q & A

హ్యుందాయ్ ఆరాలో ఉన్న వేరియంట్లు ఏవి?

హ్యుందాయ్ ఆరా ఐదు వేరియంట్ల పరిధిలో అందించబడుతుంది. అవి ఇ, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ ప్లస్ మరియు ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్లు.

Hide Answerkeyboard_arrow_down
హ్యుందాయ్ ఆరాలో ఉన్న కలర్ అప్సన్స్ ఏవి?

హ్యుందాయ్ ఆరాను వింటేజ్ బ్రౌన్, ఆల్ఫా బ్లూ, ఫైరీ రెడ్, టైటల్ గ్రే, టైఫూన్ సిల్వర్ మరియు పోలార్ వైట్ కలర్స్ లో అందిస్తున్నారు.

Hide Answerkeyboard_arrow_down
హ్యుందాయ్ ఆరాకు ప్రత్యర్థులు ఏవి?

కాంపాక్ట్-సెడాన్ విభాగంలో హ్యుందాయ్ ఆరా, మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్, ఫోక్స్‌వ్యాగన్ అమియో, టాటా టిగోర్ మరియు ఫోర్డ్ ఆస్పైర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
హ్యుందాయ్ ఆరా టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుందా?

వస్తుంది, హ్యుందాయ్ ఆరా వెన్యూ యొక్క 1.0-లీటర్ టి-జిడి పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
హ్యుందాయ్ ఆరా యొక్క సిఎన్‌జి వెర్షన్ ఉందా?

ఉంది, హ్యుందాయ్ ఆరాను సిఎన్‌జి-పవర్డ్ వేరియంట్‌తో కూడా అందిస్తున్నారు.

Hide Answerkeyboard_arrow_down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X