మహీంద్రా స్కార్పియో

మహీంద్రా స్కార్పియో
Style: ఎస్‌యూవీ
13.18 - 18.15 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

మహీంద్రా ప్రస్తుతం 5 విభిన్న వేరియంట్లు మరియు 4 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. మహీంద్రా స్కార్పియో ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, మహీంద్రా స్కార్పియో ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా మహీంద్రా స్కార్పియో మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి మహీంద్రా స్కార్పియో గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

మహీంద్రా స్కార్పియో డీజిల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎస్‌యూవీ | Gearbox
13,18,001
ఎస్‌యూవీ | Gearbox
13,90,499
ఎస్‌యూవీ | Gearbox
16,21,501
ఎస్‌యూవీ | Gearbox
16,85,001
ఎస్‌యూవీ | Gearbox
18,14,800

మహీంద్రా స్కార్పియో మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
డీజిల్ 15

మహీంద్రా స్కార్పియో రివ్యూ

Rating :
మహీంద్రా స్కార్పియో Exterior And Interior Design

మహీంద్రా స్కార్పియో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

భారత మార్కెట్లో మహీంద్రా బ్రాండ్ నుంచి అత్యధికంగా అన్నుడైన ఎస్‌యూవీలలో మహీంద్రా స్కార్పియో ఒకటి. స్కార్పియో చాలా కాలం నుండి అమ్మకానికి ఉంది మరియు సంవత్సరాలుగా చాలా సార్లు అప్డేట్ చేయబడింది.

మహీంద్రా స్కార్పియో యొక్క చివరి అప్డేట్ వెర్షన్ 2014 లో వచ్చింది. కంపెనీ దాని రూపకల్పనలో చాలా అప్డేట్స్ చేసింది. ఈ కారణంగా మహీంద్రా స్కార్పియో ఇప్పుడు కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో వస్తుంది. ఇది పెద్ద ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంది, ఇది మునుపటి కంటే నిటారుగా ఉంటుంది. ప్రొజెక్టర్ యూనిట్లు మరియు ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లతో పెద్ద హెడ్‌ల్యాంప్‌లు ఇరువైపులా ఉన్నాయి. మహీంద్రా స్కార్పియో యొక్క ఫ్రంట్ బంపర్ కూడా అప్‌డేట్ చేయబడింది. అంతే కాకుండా దీనికి ఇరువైపులా ఇప్పుడు ఫాగ్ లాంప్స్ మరియు సెంట్రల్ ఎయిర్ ఇంటెక్ వంటివి ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్న ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్కార్పియో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. మహీంద్రా స్కార్పియో యొక్క వెనుక ప్రొఫైల్ ప్రత్యేకమైన LED టైల్ లైట్స్ తో వస్తుంది. పైకప్పుతో అనుసంధానించబడిన చిన్న స్పాయిలర్ కూడా ఇందులో ఉంది.

మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ యొక్క లోపలిభాగం మునుపటి మోడల్‌లోని యుటిటేరియన్ స్వభావంతో పోలిస్తే ఎక్కువ ప్రీమియం మరియు ఖరీదైనదిగా అనిపిస్తుంది. ఈ కొత్త ఎస్‌యూవీ అనేక పరికరాలు మరియు ఫీచర్స్ కల్గి ఉండటం వల్ల, ఇది క్యాబిన్ యొక్క ప్రీమియం మరింత పెంచుతుంది.

మహీంద్రా స్కార్పియో ఇంజన్ మరియు పనితీరు

మహీంద్రా స్కార్పియో Engine And Performance

భారత మార్కెట్లో విడుదలైన కొత్త మహీంద్రా స్కార్పియో బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా నవీకరించబడింది. ఎస్‌యూవీ అప్‌డేటెడ్ 2.2-లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 3750 rpm వద్ద 140 bhp మరియు 1500 rpm వద్ద 320 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

మహీంద్రా స్కార్పియో ఇంధన సామర్థ్యం

మహీంద్రా స్కార్పియో Fuel Efficiency

మహీంద్రా ఇటీవలే స్కార్పియోను బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేసింది మరియు అందువల్ల దాని క్లెయిమ్ మైలేజ్ గణాంకాలను విడుదల చేయలేదు. అయినప్పటికీ, మునుపటి BS4 మోడల్ యొక్క గణాంకాలను గమనిస్తే ఇది 15.6 కి.మీ / లీ. కొత్త బిఎస్ 6 మహీంద్రా స్కార్పియో కూడా అదే శ్రేణిలో మైలేజ్ అందించే అవకాశం ఉంటుందని ఆశించవచ్చు.

మహీంద్రా స్కార్పియో ముఖ్యమైన ఫీచర్లు

మహీంద్రా స్కార్పియో Important Features

కొత్తగా అప్డేట్ చేయబడిన మహీంద్రా స్కార్పియో అనేక ఫీచర్స్ మరియు పరికరాలతో వస్తుంది. ఇందులో ఉన్న కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ గమనించినట్లయితే, ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఇడి టైల్ లైట్స్, మల్టీ-స్పోక్ స్టీరింగ్ వీల్, హిట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రికల్-ఫోల్డబుల్ ఓఆర్‌విఎంలు, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్‌లు , 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియోలోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, పానిక్ బ్రేక్ ఇండికేషన్, ఎమర్జెన్సీ కాల్, యాంటీ-తెఫ్ట్ అలారం, హై-స్పీడ్ అలర్ట్, సీట్-బెల్ట్ రిమైండర్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో తీర్పు

మహీంద్రా స్కార్పియో Verdict

మహీంద్రా స్కార్పియో ప్రారంభించినప్పటి నుండి భారత మార్కెట్లో ఏడు సీట్ల ఎస్‌యూవీలలో అత్యధికంగా అమ్ముడైంది. ఈ ఎస్‌యూవీ కాలక్రమేణా యుటిలిటేరియన్ వాహనం నుండి ప్రీమియం ఫీచర్‌లతో పాటు మరింత ఆధునిక మరియు ఖరీదైన డిజైన్ మరియు స్టైలింగ్‌తో అభివృద్ధి చెందింది, ఇది ఇప్పటికీ పెద్ద సంఖ్యలో వినియోగదారులను ఆకర్షిస్తుంది.

మహీంద్రా స్కార్పియో మహీంద్రా స్కార్పియో కలర్లు


Napoli Black
Molten Red
DSat Silver
Pearl White

మహీంద్రా స్కార్పియో డీజిల్ కాంపిటీటర్స్

మహీంద్రా స్కార్పియో డీజిల్ మైలేజ్ కంపారిజన్

  • టాటా సఫారి టాటా సఫారి
    local_gas_station డీజిల్ | 14.08
  • ఎంజి హెక్టర్ ప్లస్ ఎంజి హెక్టర్ ప్లస్
    local_gas_station డీజిల్ | 16.6
  • కియా సెల్టోస్ కియా సెల్టోస్
    local_gas_station డీజిల్ | 18

మహీంద్రా మహీంద్రా స్కార్పియో ఫోటోలు

మహీంద్రా స్కార్పియో Q & A

మహీంద్రా స్కార్పియో ఆఫర్‌లో ఉన్న వేరియంట్లు ఏవి?

మహీంద్రా స్కార్పియోను ఎస్ 5, ఎస్ 7, ఎస్ 9 మరియు ఎస్ 11 అనే నాలుగు వేరియంట్స్ ఉన్నాయి.

Hide Answerkeyboard_arrow_down
మహీంద్రా స్కార్పియోలో కలర్ అప్సన్స్ ఏవి?

మహీంద్రా స్కార్పియోను నాలుగు పెయింట్ స్కీమ్స్ తో అందిస్తున్నారు. అవి పెర్ల్ వైట్, నాపోలి బ్లాక్, డిశాట్ సిల్వర్ మరియు మెల్టెడ్ రెడ్.

Hide Answerkeyboard_arrow_down
మహీంద్రా స్కార్పియోకు ప్రత్యర్థులు ఏవి?

భారతీయ ఏడు సీట్ల ఎస్‌యూవీ విభాగంలో టాటా హెక్సా, టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ వంటి వాటికి మహీంద్రా స్కార్పియో ప్రత్యర్థిగా ఉంది.

Hide Answerkeyboard_arrow_down
మహీంద్రా స్కార్పియో 4WD ఎంపికలో అందుబాటులో ఉందా?

లేదు, మహీంద్రా స్కార్పియో అన్ని వేరియంట్లలో 2WD కాన్ఫిగరేషన్‌తో స్టాండర్డ్ గా వస్తుంది.

Hide Answerkeyboard_arrow_down
మహీంద్రా స్కార్పియోలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్ ఉందా?

లేదు, మహీంద్రా స్కార్పియో స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Hide Answerkeyboard_arrow_down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X