మహీంద్రా థార్

మహీంద్రా థార్
Style: SUV
12.36 - 15.49 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

మహీంద్రా ప్రస్తుతం 2 విభిన్న వేరియంట్లు మరియు 3 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. మహీంద్రా థార్ ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, మహీంద్రా థార్ ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా మహీంద్రా థార్ మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి మహీంద్రా థార్ గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

మహీంద్రా థార్ డీజిల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
SUV | Steel Rims Gearbox
12,35,823
SUV | Alloy Wheels Gearbox
15,48,694

మహీంద్రా థార్ మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
Steel Rims డీజిల్ RWD
Alloy Wheels డీజిల్ RWD

మహీంద్రా థార్ రివ్యూ

Rating :

మహీంద్రా థార్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

భారత మార్కెట్లో కొత్త 2020 మహీంద్రా థార్ అత్యంత ప్రాచుర్యం పొందిన ఆఫ్-రోడర్ ఎస్‌యూవీలలో ఒకటి. మహీంద్రా థార్ డిజైన్, ఫీచర్స్, ఎక్విప్‌మెంట్ మరియు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ పరంగా ఇటీవలే అనేక నవీకరణలను పొందింది. ఇవి ఎస్‌యూవీని మరింత స్టైలిష్‌గా మాత్రమే కాకుండా మునుపటి కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండటానికి సహాయపడతాయి.

కొత్త మహీంద్రా థార్ యొక్క ముందు నుండి ప్రారంభించినట్లైతే దీని ముందు భాగంలో పెద్ద వర్టికల్ స్లాట్ గ్రిల్‌ కలిగి ఉంటుంది. ఇరువైపులా రౌండ్ హాలోజన్ హెడ్‌ల్యాంప్ యూనిట్లు ఉన్నాయి. హెడ్‌ల్యాంప్‌ల పక్కన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఉన్నాయి, ఇవి రెండు వైపులా టర్న్ సిగ్నల్ యూనిట్లతో కలిసి ఉంటాయి.

ఫ్రంట్ గ్రిల్ క్రింద డ్యూయల్-టోన్ బంపర్ ఉంది, దీనికి ఇరువైపులా ఫాగ్ లాంప్స్ ఉంచారు. బంపర్ యొక్క దిగువ భాగం స్కిడ్ ప్లేట్‌తో వస్తుంది, ఇది ఆఫ్-రోడింగ్ చేసేటప్పుడు ఎస్‌యూవీ యొక్క అండర్‌బాడీని కాపాడుతుంది.

ఇక ఈ ఎస్‌యూవీ సైడ్స్ కి వెళ్లే కొద్దీ ఇది కఠినమైన రహదారి వైఖరిని తట్టుకోవడానికి వైడ్ వీల్ ఆర్చెస్ కలిగి ఉంటుంది. ఇందులో 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక ప్రొఫైల్ ఎల్‌ఈడీ టైల్లైట్స్ మరియు సైడ్‌వేస్ ఓపెనింగ్ బూట్‌తో పాటు పుల్ సైజు స్పేర్ వీల్‌తో వెనుక భాగంలో అమర్చబడి ఉంటుంది.

మహీంద్రా థార్ వేర్వేరు కాన్ఫిగరేషన్లలో అందించబడుతుంది. అవి ఫ్యాక్టరీ ఫిట్టేడ్ హార్డ్ టాప్, ఫిక్స్డ్ సాఫ్ట్-టాప్ లేదా కన్వర్టిబుల్ సాఫ్ట్-టాప్. థార్ లోని కొన్ని వేరియంట్లు రిమూవబుల్ డోర్స్ తో కూడా వస్తుంది.

కొత్త మహీంద్రా థార్ లోపల గమనిస్తే ఇది పాత వెర్షన్ తో పోలిస్తే కొత్త వెర్షన్ చాలా ఫ్రీమియం మరియు చాలా ఖరీదైనదిగా కనిపిస్తుంది. ఈ ఎస్‌యూవీలో ఫీచర్స్, మల్టిపుల్ కాన్ఫిగరేషన్‌లతో సౌకర్యవంతమైన సీట్లు మరియు ఇతర పరికరాలు ఉన్నాయి.

మహీంద్రా థార్ ఇంజన్ మరియు పనితీరు

2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో కొత్త 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ మరియు పాత 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ యొక్క అప్‌డేటెడ్ వెర్షన్ ఉన్నాయి. కొత్త టి-జిడి పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి మరియు 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మరొకటి mHawk డీజిల్ యూనిట్, ఇది 130 బిహెచ్‌పి మరియు 300 ఎన్ఎమ్ టార్క్ తొలగిస్తుంది. రెండు ఇంజన్లు 6 స్పీడ్ మాన్యువల్ లేదా టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడతాయి.

మహీంద్రా థార్ ఇంధన సామర్థ్యం

మహీంద్రా భారత మార్కెట్లో కొత్త థార్ యొక్క అధికారిక మైలేజ్ గణాంకాలను ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ మా అంచనాల ప్రకారం, కొత్త థార్ ఎస్‌యూవీ 15 - 17 కి.మీ / లీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 57 లీటర్ ఇంధన సామర్థ్యం కలిగిన ట్యాంకును కలిగి ఉంటుంది.

మహీంద్రా థార్ ముఖ్యమైన ఫీచర్లు

సరికొత్త మహీంద్రా థార్ ఇప్పుడు అనేక కొత్త ఫీచర్లతో నిండి ఉంది. ఇందులో ఫాలో-మీ-హోమ్ ఫంక్షన్‌తో హెడ్‌ల్యాంప్ యూనిట్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, 18 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌విఎంలు, 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ నావిగేషన్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌పై ఎమ్ఐడి, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మెకానికల్ మరియు బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్, వాషబుల్ ఫ్లోర్ విత్ డ్రెయిన్ ప్లగ్‌, రిమూవబుల్ డోర్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

కొత్త మహీంద్రా థార్‌లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిడి విత్ ఇబిడి, బ్రేక్ అసిస్ట్, రోల్ కేజ్, పానిక్ బ్రేకింగ్ సిగ్నల్, యాంటీ-తెఫ్ట్ అలారం, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ డీయాక్టివేషన్ స్విచ్ మరియు ఇఎస్‌పి విత్ రోల్-ఓవర్ మిటిగేషన్ ఉన్నాయి.

మహీంద్రా థార్ తీర్పు

మహీంద్రా థార్ భారత మార్కెట్లో ఆప్ రోడ్ సామర్థ్యాలకు ప్రసిద్ది చెందింది. ఈ కొత్త ఎస్‌యూవీ చాలా ఆధునిక ఫీచర్లు మరియు పరికరాలతో నిండి ఉంది. ఇది ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ కోసం ఎదురు చూసే ఔత్సాహికులకు ఇది చాలా మంచి ఎంపిక.

మహీంద్రా థార్ మహీంద్రా థార్ కలర్లు


Stealth Black
Tango Red
Deep Forest

మహీంద్రా థార్ డీజిల్ కాంపిటీటర్స్

మహీంద్రా థార్ డీజిల్ మైలేజ్ కంపారిజన్

  • హ్యుందాయ్ వేదిక
    హ్యుందాయ్ వేదిక
    local_gas_station డీజిల్ | FWD

మహీంద్రా మహీంద్రా థార్ ఫోటోలు

మహీంద్రా థార్ Q & A

కొత్త మహీంద్రా థార్‌లో అందించే వేరియంట్లు ఏవి?

కొత్త మహీంద్రా థార్ నాలుగు వేరియంట్లలో వస్తుంది, అవి ఏఎక్స్ స్టాండర్డ్, ఏఎక్స్, ఏఎక్స్ ఓపిటి మరియు ఎల్ఎక్స్.

Hide Answerkeyboard_arrow_down
కొత్త మహీంద్రా థార్‌లో సీటింగ్ కాన్ఫిగరేషన్ ఏమిటి?

కొత్త మహీంద్రా థార్ ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి ఆరు సీట్ల లేదా నాలుగు సీట్ల కాన్ఫిగరేషన్‌లో అందించబడుతుంది.

Hide Answerkeyboard_arrow_down
మహీంద్రా థార్ పెట్రోల్‌తో నడిచే ఇంజిన్‌తో వస్తుందా?

అవును, కొత్త మహీంద్రా థార్ కొత్త 2.0-లీటర్ టి-జిడి పెట్రోల్ యూనిట్‌తో వస్తుంది. ఇది 150 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది.

Hide Answerkeyboard_arrow_down
దేశీయ మార్కెట్లో కొత్త మహీంద్రా థార్‌కు ప్రత్యర్థులు ఏవి?

కొత్త మహీంద్రా థార్, ఫోర్స్ గూర్ఖా కు ప్రత్యర్థి.

Hide Answerkeyboard_arrow_down
కొత్త మహీంద్రా థార్‌లో కలర్ ఆప్షన్స్ ఏమిటి?

కొత్త మహీంద్రా థార్ ఆరు రంగు అప్సన్స్ తో లభిస్తుంది. అవి రాకీ బీజ్, ఆక్వామారిన్, మిస్టిక్ కాపర్, రెడ్ రేజ్, నాపోలి బ్లాక్ & గెలాక్సీ గ్రే.

Hide Answerkeyboard_arrow_down
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+