

Click it and Unblock the Notifications
హ్యుందాయ్ ప్రస్తుతం 15 విభిన్న వేరియంట్లు మరియు 1 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. హ్యుందాయ్ i20 ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, హ్యుందాయ్ i20 ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా హ్యుందాయ్ i20 మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి హ్యుందాయ్ i20 గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.
| వేరియంట్లు | ఎక్స్-షోరూమ్ ధర |
|---|---|
|
హ్యాచ్‌బ్యాక్ | Steel Rims Gearbox
|
₹ 6,69,282 |
|
హ్యాచ్‌బ్యాక్ | Steel Rims Gearbox
|
₹ 7,70,172 |
|
హ్యాచ్‌బ్యాక్ | Steel Rims Gearbox
|
₹ 7,98,174 |
|
హ్యాచ్‌బ్యాక్ | Steel Rims Gearbox
|
₹ 8,87,050 |
|
హ్యాచ్‌బ్యాక్ | Steel Rims Gearbox
|
₹ 9,49,264 |
|
హ్యాచ్‌బ్యాక్ | Steel Rims Gearbox
|
₹ 9,59,226 |
|
హ్యాచ్‌బ్యాక్ | Diamond-Cut Alloy Wheels Gearbox
|
₹ 9,85,235 |
|
హ్యాచ్‌బ్యాక్ | Steel Rims Gearbox
|
₹ 10,01,837 |
|
హ్యాచ్‌బ్యాక్ | Diamond-Cut Alloy Wheels Gearbox
|
₹ 10,44,449 |
|
హ్యాచ్‌బ్యాక్ | Steel Rims Gearbox
|
₹ 10,51,090 |
|
హ్యాచ్‌బ్యాక్ | Diamond-Cut Alloy Wheels Gearbox
|
₹ 10,61,051 |
|
హ్యాచ్‌బ్యాక్ | Diamond-Cut Alloy Wheels Gearbox
|
₹ 12,17,707 |
|
హ్యాచ్‌బ్యాక్ | Alloy Wheels Gearbox
|
₹ 12,28,601 |
|
హ్యాచ్‌బ్యాక్ | Diamond-Cut Alloy Wheels Gearbox
|
₹ 12,34,909 |
|
హ్యాచ్‌బ్యాక్ | Alloy Wheels Gearbox
|
₹ 12,45,803 |
| గేర్ బాక్స్ | ఇంధన రకం | మైలేజ్ |
|---|---|---|
| Steel Rims | పెట్రోల్ | FWD |
| Diamond-Cut Alloy Wheels | పెట్రోల్ | FWD |
| Alloy Wheels | పెట్రోల్ | FWD |
హ్యుందాయ్ ఇటీవల ఐ 20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యొక్క సరికొత్త మోడల్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆల్-న్యూ హ్యుందాయ్ ఐ 20 ఇప్పుడు దాని థార్డ్ జనరేషన్ వెర్షన్‌లో ఉంది, అంతే కాకుండా ఇది పూర్తిగా పునరుద్ధరించిన డిజైన్, కొత్త ఫీచర్లు, పరికరాలు మరియు కొత్త టెక్నాలజీ వంటి వాటిని కలిగి ఉంది.
కొత్త హ్యుందాయ్ ఐ 20 డిజైన్ గమనించనట్లైయితే ఇది బ్రాండ్ యొక్క లేటెస్ట్ డిజైన్ ఫిలాసఫీతో ‘సున్నితమైన స్పోర్టినెస్’ కలిగి ఉంటుంది. కొత్త ఐ 20 హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు డూపింగ్ బోనెట్, పియానో-బ్లాక్ మెష్‌తో కొత్త క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్‌తో వస్తుంది. గ్రిల్‌కు ఇరువైపులా ఉన్న ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, టర్న్ ఇండికేటర్స్ మరియు కార్నరింగ్ లాంప్స్ కలిగి ఉంటాయి.
కొత్త హ్యుందాయ్ ఐ 20 కొత్త ఫ్రంట్ బంపర్‌తో వస్తుంది, దీనిలో ప్రొజెక్టర్ ఫాగ్ లాంప్స్ ఇరువైపులా ఉంటాయి, సెంట్రల్ ఎయిర్ ఇన్టెక్ మరియు పియానో-బ్లాక్ ఫినిష్ ఫ్రంట్ స్కిర్టింగ్ దిగువన ఉంటాయి.
ఇక దీని సైడ్స్ కి వెళ్ళినట్లైతే దీనికి 16-ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, విండో లైన్ క్రింద రన్నింగ్ క్రోమ్ స్ట్రిప్ మరియు డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ (హై-స్పెక్ వేరియంట్లలో) ఉన్నాయి. హ్యాచ్‌బ్యాక్ యొక్క పొడవు అంతటా ఒక ప్రత్యేకమైన క్రీజ్ కూడా ఉంది, ఇది ఐ 20 యొక్క స్పోర్టి ఫీచర్ కి మరింత తోడ్పడుతుంది.
వెనుక ప్రొఫైల్ Z- ఆకారపు LED టెయిల్ లైట్స్ కలిగి ఉంది. ఇది సెంట్రల్ రిఫ్లెక్టర్ మరియు క్రోమ్ స్ట్రిప్‌తో అనుసంధానించబడి ఉంది. బూట్ మోడల్ మరియు వేరియంట్ బ్యాడ్జింగ్‌ను కూడా పొందుతుంది, వెనుక బంపర్ రిఫ్లెక్టర్ చివర్లో మరియు మధ్యలో ఫాక్స్ డిఫ్యూజర్‌ను కలిగి ఉంటుంది.
సరికొత్త హ్యుందాయ్ ఐ 20 లోపల పూర్తిగా పునరుద్ధరించిన డాష్‌బోర్డ్ ఉంది. హ్యాచ్‌బ్యాక్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సౌకర్యవంతమైన సీట్లు ఉంటాయి, ఇవి ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
ఆల్-న్యూ హ్యుందాయ్ ఐ 20 మూడు ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఇందులో 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేసినప్పుడు 83 బిహెచ్‌పి మరియు బ్రాండ్ యొక్క ఐవిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌కు జత చేసినప్పుడు 87 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది.
రెండవ ఇంజిన్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 120 బిహెచ్‌పి మరియు 172 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ ఐఎమ్‌టి లేదా 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ యూనిట్‌తో జతచేయబడుతుంది. ఇక మూడవ ఇంజిన్ అప్సన్ విషయానైకి వస్తే ఇందులో1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 100 బిహెచ్‌పి మరియు 240 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.
కొత్త హ్యుందాయ్ ఐ 20 లో ఉన్న 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ ఒక లీటరుకి 20.25 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. 1.2-లీటర్ ఎన్‌ఐఏ పెట్రోల్ 20.35 కిలోమీటర్ల మెరుగైన మైలేజీని ఇస్తుందని చెబుతున్నారు. అయితే, కొత్త ఐ 20 యొక్క డీజిల్ ఇంజన్ భారతదేశంలో అత్యంత ఫ్యూయెల్ కెపాసిటీ కలిగిన 1.5-లీటర్ యూనిట్ అని పేర్కొంది, ఇది లీటరుకు 25.2 కి.మీ పరిధిని అందిస్తుంది. కొత్త హ్యుందాయ్ ఐ 20 యొక్క అన్ని వేరియంట్లు 37-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంటాయి.
కొత్త హ్యుందాయ్ ఐ 20 కొత్త ఫీచర్స్ తో ప్రవేశపెట్టబడింది. ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, 16-ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌విఎంలు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్లూ లింక్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, బోస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.
ఆల్-న్యూ ఐ 20 చాలా వరకు మంచి ఫీచర్స్ కలిగి ఉంది. ఇది స్పోర్టి మరియు స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్ ఎంపికలు మరియు అద్భుతమైన డ్రైవ్ మరియు పెర్పామెన్స్ కలిగి ఉంది. ఇవన్నీ ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను భారతీయ మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్‌గా చేస్తాయి.
కొత్త హ్యుందాయ్ ఐ 20 మాగ్మా, స్పోర్ట్జ్, అష్టా మరియు అష్టా (ఓ) అనే నాలుగు వేరియంట్లు.
కొత్త హ్యుందాయ్ ఐ 20 టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, మెటాలిక్ కాపర్, స్టార్రి నైట్, ఫైరీ రెడ్, పోలార్ వైట్, రెడ్ / బ్లాక్ & వైట్ / బ్లాక్ కలర్స్.
కొత్త హ్యుందాయ్ ఐ 20 మారుతి బాలెనో, టయోటా గ్లాంజా, వోక్స్వ్యాగన్ పోలో, హోండా జాజ్ మరియు టాటా ఆల్ట్రోజ్ వంటి వాటికి ఇది ప్రత్యర్థిగా ఉంటుంది.
అవును, కొత్త హ్యుందాయ్ ఐ 20 దాని మునుపటి మోడల్స్ తో పోలిస్తే పెద్ద మొత్తం కొలతలు కలిగి ఉంది.
ఆల్ట్రోజ్‌తో పోల్చితే సరికొత్త హ్యుందాయ్ ఐ 20 ఖచ్చితంగా చాలా మంచి ఎంపిక. అయితే, ఆల్ట్రోజ్ మరింత సరసమైనది.


Click it and Unblock the Notifications
