కియా కార్నివాల్

కియా కార్నివాల్
Style: MUV
₹56.00 - 70.61 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

కియా ప్రస్తుతం 2 విభిన్న వేరియంట్లు మరియు 0 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. కియా కార్నివాల్ ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, కియా కార్నివాల్ ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా కియా కార్నివాల్ మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి కియా కార్నివాల్ గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

కియా కార్నివాల్ హైబ్రిడ్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
MUV | Gearbox
₹ 56,00,000

కియా కార్నివాల్ డీజిల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
MUV | Diamond-Cut Alloy Wheels Gearbox
₹ 70,61,135

కియా కార్నివాల్ మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
హైబ్రిడ్ FWD
Diamond-Cut Alloy Wheels డీజిల్ FWD

కియా కార్నివాల్ రివ్యూ

Rating :

కియా కార్నివాల్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

కియా కార్నివాల్ భారత మార్కెట్లో సెల్టోస్ ఎస్‌యూవీ తర్వాత బ్రాండ్ యొక్క రెండవ ఉత్పత్తి. ఇది దక్షిణ కొరియా కార్ల తయారీదారు నుండి వచ్చిన ప్రీమియం ఎంపివి సమర్పణ. ఇది అనేక ఫీచర్స్ మరియి పరికరాలను కలిగి ఉంటుంది. ఈ కారణంగా ఇది భారత మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన సమర్పణగా నిలిచింది.

కియా కార్నివాల్ చాలా పెద్దదిగా ఉంటుంది. దీని పొడవు దాదాపు 5 మీటర్లకు దగ్గరగా ఉంటుంది. ఎంపివి ముందు భాగంలో క్రోమ్ స్ట్రిప్‌తో చుట్టుపక్కల బ్రాండ్ యొక్క సిగ్నేచర్ టైగర్-నోస్ గ్రిల్ ఉంది మరియు ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డిఆర్ఎల్ లతో స్వీట్‌బ్యాక్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌కి ఇరువైపులా ఉంటుంది. దిగువ భాగంలో కార్నివాల్ యొక్క ముందు బంపర్లు బ్రాండ్ యొక్క ICE క్యూబ్ ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్ ఉంటాయి.

ఇది పెద్ద స్టైలిష్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది.ఇది వెనుకవైపు కూడా మినిమాలిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. వెనుక బంపర్‌పై ఎల్‌ఈడీ టైల్ లైట్స్, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ మరియు రిఫ్లెక్టర్లు వంటివి ఉంటాయి.

కియా కార్నివాల్ యొక్క ఇంటీరియర్‌ విషయానికి వస్తే, ఇందులో అనేక ఫీచర్లు మరియు కనెక్టెడ్ టెక్నాలజీని కలిగి ఉంది. డాష్‌బోర్డ్ ప్రీమియం సాఫ్ట్-టచ్ మెటీరియల్‌లను అందిస్తుంది మరియు ప్రీమియం క్వాలిటీతో అద్భుతమైన ఫిట్ మరియు ఫినిష్‌తో వస్తుంది.

కియా కార్నివాల్ ఇంజన్ మరియు పనితీరు

కొత్త కియా కార్నివాల్ ప్రీమియం ఎమ్‌పివి సింగిల్ ఇంజన్ ఆప్సన్ తో వస్తుంది. ఇది బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ రూపంలో వస్తుంది. ఈ ఇంజన్ 197 బిహెచ్‌పి మరియు 440 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ కి స్టాండర్డ్ గా జతచేయబడుతుంది.

కియా కార్నివాల్ ఇంధన సామర్థ్యం

కియా కార్నివాల్ పెద్ద ఎమ్‌పివి కావున, ఇది 60 లీటర్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంటుంది. ఇది ఒక లీటరుకు సుమారు 13 నుంచి 14 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ ట్యాంక్ తో సుమారు 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ వివిధ బాహ్య కారకాలను బట్టి వాస్తవ ప్రపంచంలో మైలేజ్ గణాంకాలు మారే అవకాశం ఉంది.

కియా కార్నివాల్ ముఖ్యమైన ఫీచర్లు

కియా కార్నివాల్ అనేది భారతీయ మార్కెట్లో బ్రాండ్ యొక్క ప్రీమియం ఆఫర్. ఈ ఎంపివి లేటెస్ట్ ఫీచర్స్, ఎక్విప్మెంట్ మరియు కనెక్ట్ టెక్నాలజీలను కలిగి ఉంటుంది. కియా కార్నివాల్‌లో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్ ORVM లు, ఎలక్ట్రికల్ స్లైడింగ్ రియర్ డోర్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రెండవ వరుసలో వ్యక్తిగత కెప్టెన్ సీట్లు ప్రీమియం లెదర్ అప్హోల్స్ట్రే, కనెక్ట్ టెక్నాలజీ, యాండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ మరియు కీలెస్ ఎంట్రీ వంటివి ఉంటాయి.

కియా కార్నివాల్‌లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో, హై-స్పీడ్ వార్ణింగ్, సీట్-బెల్ట్ రిమైండర్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, 360-డిగ్రీ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు డైనమిక్ గైడ్లైన్స్ తో కెమెరా, హిల్-స్టార్ట్ అసిస్ట్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, బ్రేక్ అసిస్ట్ వంటివి ఉంటాయి.

కియా కార్నివాల్ తీర్పు

కియా కార్నివాల్ ఎంపివి అనేది భారతీయ మార్కెట్లో బ్రాండ్ యొక్క ఎంపివి ఆఫర్. కార్నివాల్ ఎంపివి అనేక లగ్జరీ ఫీచర్స్, టెక్నాలజీ  మరియు బలమైన పనితీరుతో వస్తుంది. ఇవన్నీ కలిగి ఉండటంతో ఇది ఎంపివి విభాగంలో చాలా ఆకర్షణీయమైన సమర్పణగా నిలిచింది.

కియా కియా కార్నివాల్ ఫోటోలు

కియా కార్నివాల్ Q & A

కియా కార్నివాల్ ఎంపివిలోని వేరియంట్స్ ఏవి?

కియా కార్నివాల్ లో ప్రీమియం, ప్రెస్టీజ్ మరియు లిమోసిన్ అనే మూడు వేరియంట్లు ఉన్నాయి.

Hide Answerkeyboard_arrow_down
కియా కార్నివాల్ ఎంపివి యొక్క సీటింగ్ కాన్ఫిగరేషన్ ఏమిటి?

కియా కార్నివాల్ భారతీయ మార్కెట్లో 7, 8 లేదా 9-సీట్ల కాన్ఫిగరేషన్‌తో అందించబడుతుంది.

Hide Answerkeyboard_arrow_down
కియా కార్నివాల్‌లో కలర్ ఆప్సన్స్ ఏవి?

కియా కార్నివాల్ బ్లాక్, సిల్వర్ మరియు వైట్ అనే మూడు పెయింట్ స్కీమ్ లతో అందించబడుతుంది.

Hide Answerkeyboard_arrow_down
భారతదేశంలో కియా కార్నివాల్‌కు ప్రత్యర్థులు ఏవి?

కియా కార్నివాల్ టయోటా ఇన్నోవా క్రిస్టా కి ప్రత్యర్థిగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
కియా కార్నివాల్ యొక్క కొలతలు?

కియా కార్నివాల్ పొడవు 5115 మిమీ, వెడల్పు 1985 మిమీ మరియు ఎత్తు 1740 మిమీ మరియు 3060 మిమీ వీల్ బేస్ కలిగి ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
కియా కార్నివాల్ యొక్క బూట్ సామర్థ్యం ఎంత?

కియా కార్నివాల్ 540 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తుంది, ఇది మూడవ వరుస సీట్లను మడతపెట్టడం ద్వారా మరింత విస్తరించవచ్చు.

Hide Answerkeyboard_arrow_down
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+