టొయోటా వెల్‌ఫైర్

టొయోటా వెల్‌ఫైర్
Style: ఎమ్‌యూవీ
89.85 - 89.85 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

టొయోటా ప్రస్తుతం 1 విభిన్న వేరియంట్లు మరియు 4 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. టొయోటా వెల్‌ఫైర్ ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, టొయోటా వెల్‌ఫైర్ ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా టొయోటా వెల్‌ఫైర్ మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి టొయోటా వెల్‌ఫైర్ గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

టొయోటా వెల్‌ఫైర్ హైబ్రిడ్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎమ్‌యూవీ | Gearbox
89,85,000

టొయోటా వెల్‌ఫైర్ మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
హైబ్రిడ్ 16.35

టొయోటా వెల్‌ఫైర్ రివ్యూ

Rating :
టొయోటా వెల్‌ఫైర్ Exterior And Interior Design

టొయోటా వెల్‌ఫైర్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

టయోటా వెల్‌ఫైర్ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క లేటెస్ట్ ప్రీమియం ఎమ్‌పివి ఆఫర్. ఈ ఎమ్‌పివి మంచి ఫీచర్స్, పరికరాలతో నిండి ఉండి మంచి ఇంజిన్ పర్ఫామెన్ అందిస్తుంది. ఇది వినియోగదారులకు లగ్జరీగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది.

టయోటా వెల్‌ఫైర్ మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఎమ్‌పివి రోడ్లపై కమాండింగ్ ఉనికిని అందిస్తుంది. ఐతే కాకుండా ఇది పెద్ద కొలతలు కలిగి, క్రోమ్ బిట్స్ పుష్కలంగా మరియు ప్రీమియం లక్షణాలు మరియు పరికరాలతో వస్తుంది.

టయోటా వెల్‌ఫైర్ యొక్క ముందు భాగంలో చుట్టూ క్రోమ్ యాక్సెంట్స్ ఉన్నాయి. ఇది ఇంటిగ్రేటెడ్ LED DRL లతో సొగసైన LED హెడ్‌ల్యాంప్‌లను పొందుతుంది. LED ఫాగ్ లాంప్ బంపర్‌పై క్రిందికి ఉంచబడతాయి. ఫ్రంట్ గ్రిల్ క్రోమ్‌లో పూర్తవుతుంది, హెడ్‌ల్యాంప్‌లు మరియు ఫాగ్ లాంప్ సరౌండ్స్‌తో పాటు. ఫ్రంట్ బంపర్‌లో పెద్ద సెంట్రల్ ఎయిర్ ఇన్టేక్ కూడా ఉంటుంది.

టయోటా వెల్‌ఫైర్ యొక్క సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ విషయైకి వస్తే, దీని విండో-లైన్‌లో సన్నని క్రోమ్ స్ట్రిప్‌తో పాటు 17 ఇంచెస్ హైపర్-క్రోమ్ వీల్స్ కలిగి ఉంటుంది. ఈ MPV వెనుక భాగంలో LED టైల్ లైట్స్ పైన క్రోమ్ యొక్క మందపాటి స్ట్రిప్ ఉంది, ఇందులో టయోటా బ్యాడ్జింగ్ కూడా ఉంది.

టయోటా వెల్‌ఫైర్ యొక్క ఇంటీరియర్‌లు ప్రీమియం-థీమ్‌తో ముందుకు వెళ్తాయి. క్యాబిన్ మరియు సీట్లు లెదర్ అపోల్స్ట్రేలో పూర్తవుతాయి, డాష్బోర్డ్ చుట్టూ సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ ఉన్నాయి, చక్కగా ఇంటిగ్రేటెడ్ సెంటర్ కన్సోల్ తో పాటు పెద్ద టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఇందులో ఉంటుంది.

టొయోటా వెల్‌ఫైర్ ఇంజన్ మరియు పనితీరు

టొయోటా వెల్‌ఫైర్ Engine And Performance

టయోటా వెల్‌ఫైర్‌ ఒకే ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటారులకు అనుసంధానించబడి బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది. ఇందులో 2.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ రూపంలో వస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 4700 ఆర్‌పిఎమ్ వద్ద 115 bhp మరియు 2800 - 4000 ఆర్‌పిఎమ్ వద్ద 198 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టొయోటా వెల్‌ఫైర్ ఇంధన సామర్థ్యం

టొయోటా వెల్‌ఫైర్ Fuel Efficiency

టయోటా వెల్‌ఫైర్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే, ఇది ఒక లీటరుకు ARAI- సర్టిఫైడ్ ప్రకారం 16.35 కి.మీ మైలేజ్ అందిస్తుంది. టయోటా వెల్‌ఫైర్ యొక్క బరువు 2815 కేజీల వరకు ఉండి చాలా పెద్దదిగా ఉంటుంది.

టొయోటా వెల్‌ఫైర్ ముఖ్యమైన ఫీచర్లు

టొయోటా వెల్‌ఫైర్ Important Features

టయోటా వెల్‌ఫైర్ ప్రీమియం ఎమ్‌పివి కావడంతో, ఇది స్టాండర్డ్ ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంటుంది. టయోటా వెల్‌ఫైర్ ఎమ్‌పివిలో ఎల్‌ఈడీ లాంప్స్ ఆల్‌రౌండ్, ప్రీమియం లెదర్ అపోల్స్ట్రే, రెట్రో-ఫిట్ ఎలక్ట్రానిక్-అడ్జస్టబుల్ లెగ్ సపోర్ట్స్, మిడిల్-రో కెప్టెన్ సీట్లలో హాట్ అండ్ కోల్డ్ ఫీచర్, ట్విన్-సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, మిడిల్ అండ్ మూడవ వరుస ప్రయాణీకులకు పైకప్పుతో అమర్చిన 13 ఇంచెస్ ఎంటర్టైనమెట్ సీట్స్, 16-కలర్ ఛాయిస్ యాంబియంట్ లైటింగ్ మరియు ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

టయోటా వెల్‌ఫైర్‌లో సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగులు, పనోరమిక్ వ్యూ మానిటర్ (360-డిగ్రీ కెమెరా), ఎబిడి విత్ ఇబిడి, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ డైనమిక్స్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ (విడిఎమ్), హై-స్పీడ్ వార్ణింగ్, సీట్-బెల్ట్ ప్రెటెన్షనర్స్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు కెమెరా వంటివి వున్నాయి.

టొయోటా వెల్‌ఫైర్ తీర్పు

టొయోటా వెల్‌ఫైర్ Verdict

టయోటా వెల్‌ఫైర్ భారతీయ మార్కెట్లో జపనీస్ బ్రాండ్ యొక్క లగ్జరీ MPV. వెల్‌ఫైర్ ఒక బలమైన పవర్‌ట్రెయిన్‌ను అందిస్తుంది, ఇది విలాసవంతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. లగ్జరీ మరియు స్టైల్‌లో ప్రయాణించాలనుకునే వారికి ఈ MPV ఖచ్చితంగా సరిపోతుంది.

టొయోటా వెల్‌ఫైర్ టొయోటా వెల్‌ఫైర్ కలర్లు


Burning Black
Black
Graphite
Pearl White

టొయోటా టొయోటా వెల్‌ఫైర్ ఫోటోలు

టొయోటా వెల్‌ఫైర్ Q & A

భారతదేశంలో టయోటా వెల్‌ఫైర్ ఎంపివికి ప్రత్యర్థులు ఏవి?

టయోటా వెల్‌ఫైర్ భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
టయోటా వెల్‌ఫైర్‌లో లభించే వేరియంట్లు ఏవి?

టయోటా వెల్‌ఫైర్‌ను ఒకే ‘ఎగ్జిక్యూటివ్ లాంజ్’ వేరియంట్‌లో మాత్రమే అందిస్తున్నారు.

Hide Answerkeyboard_arrow_down
టయోటా వెల్‌ఫైర్‌లోని కలర్ ఆప్సన్స్ ఏవి?

టయోటా వెల్‌ఫైర్ నాలుగు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి బర్నింగ్ బ్లాక్, వైట్ పెర్ల్, గ్రాఫైట్ మరియు బ్లాక్ కలర్స్.

Hide Answerkeyboard_arrow_down
టయోటా వెల్‌ఫైర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుందా?

రాదు, టయోటా వెల్‌ఫైర్ ఒకే పెట్రోల్ ఇంజన్ ఎంపికతో మాత్రమే అందించబడుతుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటారులతో జతచేయబడుతుంది.

Hide Answerkeyboard_arrow_down
టయోటా వెల్‌ఫైర్‌లో స్టాండ్-అవుట్ ఫీచర్ ఏమిటి?

టయోటా వెల్‌ఫైర్ మధ్య-వరుసలో లెగ్ సపోర్ట్‌లతో హీట్ అండ్ కోల్డ్ ఇండ్యూజువల్ కెప్టెన్ సీట్లతో వస్తుంది.

Hide Answerkeyboard_arrow_down
టయోటా వెల్‌ఫైర్ యొక్క మైలేజ్ ఎంత?

టయోటా వెల్‌ఫైర్ యొక్క మైలేజ్ ARAI- సర్టిఫైడ్ ప్రకారం లీటరుకు 16.35 కి.మీ వరకు ఉంటుంది. అయితే వాస్తవ-ప్రపంచ పరిస్థితులలో, వివిధ బాహ్య కారకాలపై ఆధారపడి, లీటరుకు 13 కిమీ నుంచి 14 కి.మీ వరకు ఉండవచ్చని మేము ఆశిస్తున్నాము.

Hide Answerkeyboard_arrow_down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X