కియా సోనెట్

కియా సోనెట్
Style: ఎస్‌యూవీ
6.87 - 13.51 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

కియా ప్రస్తుతం 27 విభిన్న వేరియంట్లు మరియు 4 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. కియా సోనెట్ ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, కియా సోనెట్ ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా కియా సోనెట్ మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి కియా సోనెట్ గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

కియా సోనెట్ పెట్రోల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎస్‌యూవీ | Gearbox
6,87,188
ఎస్‌యూవీ | Gearbox
7,87,189
ఎస్‌యూవీ | Gearbox
8,73,190
ఎస్‌యూవీ | Gearbox
9,87,191
ఎస్‌యూవీ | Gearbox
10,37,191
ఎస్‌యూవీ | Gearbox
10,79,000
ఎస్‌యూవీ | Gearbox
11,07,192
ఎస్‌యూవీ | Gearbox
11,49,000
ఎస్‌యూవీ | Gearbox
11,83,193
ఎస్‌యూవీ | Gearbox
11,93,193
ఎస్‌యూవీ | Gearbox
12,27,193
ఎస్‌యూవీ | Gearbox
12,37,059
ఎస్‌యూవీ | Gearbox
12,99,012
ఎస్‌యూవీ | Gearbox
13,08,964

కియా సోనెట్ డీజిల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎస్‌యూవీ | Gearbox
8,51,371
ఎస్‌యూవీ | Gearbox
9,45,372
ఎస్‌యూవీ | Gearbox
9,97,191
ఎస్‌యూవీ | Gearbox
10,65,373
ఎస్‌యూవీ | Gearbox
11,09,000
ఎస్‌యూవీ | Gearbox
11,45,374
ఎస్‌యూవీ | Gearbox
11,89,000
ఎస్‌యూవీ | Gearbox
12,15,375
ఎస్‌యూవీ | Gearbox
12,25,135
ఎస్‌యూవీ | Gearbox
12,61,375
ఎస్‌యూవీ | Gearbox
12,71,078
ఎస్‌యూవీ | Gearbox
13,41,376
ఎస్‌యూవీ | Gearbox
13,51,126

కియా సోనెట్ మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
పెట్రోల్ 18.3
డీజిల్ 19

కియా సోనెట్ రివ్యూ

Rating :

కియా సోనెట్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

ఎక్స్టీరియర్ & ఇంటీరియర్ డిజైన్

కియా సోనెట్ భారత మార్కెట్లో దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ నుండి వచ్చిన మూడవ మోడల్. సోనెట్ భారత మార్కెట్లో కాంపెటేటివ్ సబ్-4 మీటర్ల ఎస్‌యూవీ విభాగంలో మరియు బ్రాండ్ యొక్క ఉత్పత్తి శ్రేణిలో సెల్టోస్ క్రింద ఉంది. కియా సోనెట్ చాలా బోల్డ్ మరియు స్పోర్టి డిజైన్‌తో వస్తుంది. కియా సోనెట్ ఇది దాని విభాగంలో ఆకర్షణీయమైన సమర్పణగా నిలిచింది.

కియా సోనెట్ యొక్క ముందు భాగంలో ‘టైగర్ నోస్’ గ్రిల్‌తో బ్లాక్ మెష్ మరియు రెడ్ ఇన్సర్ట్‌లతో వస్తుంది. గ్రిల్ చుట్టూ క్రోమ్ స్ట్రిప్ ఉంది. ఇంటిగ్రేటెడ్ ఎల్ఇడి డిఆర్ఎల్ లతో బ్రాండ్ యొక్క ‘క్రౌన్-జ్యువెల్’ ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు గ్రిల్‌ చుట్టూ ఉంటాయి. ఇవి టర్న్ ఇండికేటర్లుగా కూడా ఉంటాయి. ఫ్రంట్ బంపర్స్ కి ఇరువైపులా ఫాగ్ లాంప్స్ కలిగి ఉంటుంది.

కియా సోనెట్ యొక్క సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ అదే స్పోర్టి డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఎస్‌యూవీ యొక్క సైడ్ ప్రొఫైల్ స్టైలిష్ 16-ఇంచెస్ క్రిస్టల్-కట్ అల్లాయ్ వీల్స్ తో వస్తుంది. వీల్ ఆర్చెస్ బ్లాక్ క్లాడింగ్ తో కప్పబడి ఉంటాయి. సైడ్ ప్రొఫైల్ సిల్వర్ ఫినిషెడ్ రూప్ రైల్ మరియు క్రోమ్ డోర్ హ్యాండిల్స్‌తో కూడా వస్తుంది.

కియా యొక్క వెనుక ప్రొఫైల్‌లో హార్ట్ బీట్ టైల్ లాంప్స్ ఉన్నాయి, ఇవి సన్నని రిఫ్లెక్టర్ స్ట్రిప్ ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. బంపర్ యొక్క దిగువ భాగం గ్లోస్ బ్లాక్‌లో పూర్తయింది. అంతే కాకుండా ఫేక్ ఎగ్జాస్ట్ పోర్ట్‌లకు సిల్వర్ యాక్సెంట్స్ మరియు ఫాక్స్ డిఫ్యూజర్‌ను కలిగి ఉంది.

కియా సోనెట్ లోపలి భాగం చాలా ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. క్యాబిన్ సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, లెథెరెట్ అప్హోల్స్టరీ మరియు ప్లాస్టిక్ భాగాలతో రూపొందించబడింది. లెథరెట్ అప్హోల్స్టరీ సీట్లు, గేర్ లివర్, స్టీరింగ్ వీల్ మరియు సైడ్ డోర్ ప్యానెల్స్ వరకు విస్తరించి ఉంది. ఇందులో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 10.25-ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇవి కారుకు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని అందిస్తాయి.

కియా సోనెట్ ఇంజన్ మరియు పనితీరు

ఇంజిన్ & పెర్ఫామెన్స్

కియా సోనెట్ మూడు ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. ఇందులో రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఎంపికలలో 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 83 బిహెచ్‌పి మరియు 115 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. రెండవ పెట్రోల్ ఇంజన్ 1.0-లీటర్ టి-జిడిఐ యూనిట్ రూపంలో 120 బిహెచ్‌పి మరియు 172 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఐఎంటి (ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) లేదా 7-స్పీడ్ డిసిటి (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్మిషన్) ఆటోమేటిక్‌తో జతచేయబడుతుంది.

మూడవ ఇంజన్ 1.5-లీటర్ సిఆర్డి డీజిల్ యూనిట్ రూపంలో వస్తుంది. ఈ ఇంజిన్ రెండు స్టేట్స్ ఆఫ్ ట్యూన్లో అందించబడుతుంది. లో స్టేట్-ఆఫ్-ట్యూన్ 100 బిహెచ్‌పి మరియు 240 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. హై స్టేట్-ఆఫ్-ట్యూన్ యూనిట్ 115 బిహెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, మరియు ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

కియా సోనెట్ ఇంధన సామర్థ్యం

ఫ్యూయెల్ ఎఫిషియన్సీ

కియా సోనెట్ దాని అన్ని ఇంజిన్ల నుండి బలమైన పనితీరును అందించడంతో పాటు, అధిక ఇంధన సామర్థ్య గణాంకాలను కూడా ఇస్తుంది. 1.2-లీటర్ పెట్రోల్ యూనిట్ 18.4 కి.మీ / లీ ఇస్తుందని కియా మోటార్స్ పేర్కొంది. అదేవిధంగా 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ 18.2 కి.మీ / లీ ఇంధన-సామర్థ్యాన్ని అందిస్తుంది. మరోవైపు డీజిల్ ఆటోమేటిక్‌లో 19 కి.మీ / లీ మరియు మాన్యువల్ వెర్షన్‌లో 24.1 కి.మీ / లీ మెరుగైన మైలేజ్ గణాంకాలను అందిస్తుంది. పేర్కొన్న అన్ని మైలేజ్ గణాంకాలు ఏఆర్ఏఐ- సర్టిఫైడ్ చేయబడినవి.

కియా సోనెట్ ముఖ్యమైన ఫీచర్లు

ఇంపార్టెంట్ ఫీచర్స్

కియా సోనెట్ దాని యువిఓ కనెక్ట్ టెక్నాలజీతో పాటు ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. కియా సోనెట్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టైల్లైట్స్, 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, రియర్ ఎసి వెంట్స్, 57 స్మార్ట్ ఫీచర్లతో యువోఓ కనెక్ట్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్, కీలెస్ ఇగ్నిషన్ మరియు స్టార్ట్ / స్టాప్ వంటి మరెన్నోఫీచర్స్ ఉంటాయి.

కియా సోనెట్‌లోని సేఫ్టీ ఫీచర్స్ గమనించినట్లయితే ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఎబిడి, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్, రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ గైడ్లైన్స్, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్లు మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ అంచర్స్ వంటివి ఉంటాయి.

కియా సోనెట్ తీర్పు

వెర్డిక్ట్

కియా సోనెట్ భారతీయ మార్కెట్లో ప్రారంభించక ముందే మంచి స్పందన లభించింది. సోనెట్ లో ఉండే మంచి ఫీచర్స్ మరియు టెక్నాలజీ వల్ల సౌకర్యవంతమైన మరియు నమ్మకమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. కియా సోనెట్ దాని విభాగంలో ఆకర్షణీయమైన సమర్పణగా మారుతుంది.

కియా సోనెట్ కియా సోనెట్ కలర్లు


Aurora Black Pearl
Gravity Grey
Steel Silver
Glacier White Pearl

కియా సోనెట్ పెట్రోల్ కాంపిటీటర్స్

కియా సోనెట్ డీజిల్ కాంపిటీటర్స్

కియా సోనెట్ పెట్రోల్ మైలేజ్ కంపారిజన్

 • ఎంజి ఆస్టర్ ఎంజి ఆస్టర్
  local_gas_station పెట్రోల్ | 0
 • హ్యుందాయ్ క్రెటా హ్యుందాయ్ క్రెటా
  local_gas_station పెట్రోల్ | 17
 • నిస్సాన్ కిక్స్ నిస్సాన్ కిక్స్
  local_gas_station పెట్రోల్ | 15.8

కియా సోనెట్ డీజిల్ మైలేజ్ కంపారిజన్

 • మహీంద్రా థార్ మహీంద్రా థార్
  local_gas_station డీజిల్ | 0
 • హ్యుందాయ్ క్రెటా హ్యుందాయ్ క్రెటా
  local_gas_station డీజిల్ | 21
 • టాటా నెక్సాన్ టాటా నెక్సాన్
  local_gas_station డీజిల్ | 22.4

కియా కియా సోనెట్ ఫోటోలు

కియా సోనెట్ Q & A

భారత మార్కెట్లో కియా సోనెట్‌కు ప్రత్యర్థులు ఎవరు?

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సన్ మరియు మహీంద్రా ఎక్స్‌యువి 300 వంటి వాటికి కియా సోనెట్ ప్రత్యర్థిగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
కియా సోనెట్‌లో ఆఫర్‌లో ఉన్న వేరియంట్లు ఏవి?

కియా సోనెట్ ఆరు వేరియంట్ల పరిధిలో అందించబడుతుంది. HTE, HTK, HTK +, HTX, HTX + మరియు GTX +.

Hide Answerkeyboard_arrow_down
కియా సోనెట్‌లో ఎన్ని కలర్ ఎంపికలు ఇవ్వబడ్డాయి?

కియా సోనెట్ 11 కలర్ ఎంపికలలో అందించబడుతుంది. ఇందులో 8 సింగిల్-టోన్ మరియు 3 డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ పరిధిలో అందించబడతాయి.

Hide Answerkeyboard_arrow_down
కియా సోనెట్‌లో ఎంచుకోవడానికి ఉత్తమమైన ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ ఎంపిక ఏది?

డీజిల్-ఆటోమేటిక్ పవర్‌ట్రెయిన్‌తో కూడిన కియా సోనెట్ జిటిఎక్స్ ప్లస్ లేదా ఐఎమ్‌టి గేర్‌బాక్స్‌తో ఉన్న టర్బో-పెట్రోల్‌కు అత్యధిక డిమాండ్ ఉంది మరియు ఇది ఉత్తమ ఎంపిక.

Hide Answerkeyboard_arrow_down
కియా సోనెట్‌లో బూట్ సామర్థ్యం ఎంత?

కియా సోనెట్ 392-లీటర్ల సెగ్మెంట్-లీడింగ్ బూట్ స్పేస్‌తో వస్తుంది.

Hide Answerkeyboard_arrow_down
కియా సోనెట్ కోసం మొత్తం బుకింగ్ అమౌంట్ ఎంత?

కియా సోనెట్‌ను ఆన్‌లైన్‌లో లేదా భారతదేశం అంతటా ఏదైనా కంపెనీ డీలర్‌షిప్‌ల ద్వారా రూ. 25 వేలకు బుక్ చేసుకోవచ్చు.

Hide Answerkeyboard_arrow_down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X