టాటా నెక్సన్ EV

టాటా నెక్సన్ EV
Style: SUV
₹13.33 - 19.02 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

టాటా ప్రస్తుతం 8 విభిన్న వేరియంట్లు మరియు 3 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. టాటా నెక్సన్ EV ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, టాటా నెక్సన్ EV ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా టాటా నెక్సన్ EV మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి టాటా నెక్సన్ EV గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

టాటా నెక్సన్ EV ఎలక్ట్రిక్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
SUV | Steel Rims Gearbox
₹ 13,33,446
SUV | Alloy Wheels Gearbox
₹ 14,09,451
SUV | Steel Rims Gearbox
₹ 15,25,950
సబ్ కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 16,34,631
SUV | Alloy Wheels Gearbox
₹ 17,39,311
SUV | Alloy Wheels Gearbox
₹ 18,80,629
సబ్ కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 19,01,565
సబ్ కాంపాక్ట్ SUV | Alloy Wheels Gearbox
₹ 19,01,565

టాటా నెక్సన్ EV మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
Steel Rims ఎలక్ట్రిక్ FWD
Alloy Wheels ఎలక్ట్రిక్ FWD

టాటా నెక్సన్ EV రివ్యూ

Rating :

టాటా నెక్సన్ EV ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

టాటా నెక్సాన్ ఈవి భారత మార్కెట్లో ప్రవేశపెట్టబడిన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ. నెక్సాన్ ఈవి కన్వెర్సిషినల్ ఫాసిల్ ఫ్యూయెల్ పవర్ తో కూడిన ఎస్‌యూవీ యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌పై ఆధారపడింది. అంతే కాకుండా ఎస్‌యూవీ యొక్క డిజైన్ పరంగా అనేక అప్డేట్స్ కలిగి ఉంది.

ఈ ఎస్‌యూవీ యొక్క ముందుభాగం నుంచి ప్రారంభించినట్లైతే, కొత్త టాటా నెక్సాన్ ఈవి కొత్తగా రూపొందించిన ఒక జత ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది, ఇది ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కంటే చాలా పదునైన మరియు సొగసైనదిగా కనిపిస్తుంది. హెడ్‌ల్యాంప్‌లు ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో కూడా వస్తాయి. ప్రధాన హెడ్‌ల్యాంప్ క్లస్టర్ మధ్యలో మందపాటి ప్యానల్‌ను కలిగి ఉంది, టాటా లోగో క్రోమ్‌లో పూర్తయిన గ్లోస్ బ్లాక్‌లో పూర్తి చేయబడింది. అదేవిధంగా దీని సైడ్స్ లో ‘EV’ బ్యాడ్జ్ కూడా ఉంటుంది.

కొత్త టాటా నెక్సాన్ ఈవిలోని బంపర్‌లు కూడా అప్డేట్ చేయబడ్డాయి. క్రింద ఉన్న సెంట్రల్ ఎయిర్ ఇంటేక్ పై ‘ఎలక్ట్రిక్ బ్లూ’ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక జత ఫాగ్ లాంప్స్ దానికి ఇరువైపులా ఉంచారు.

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే దీని విండో లైన్ వెంట ‘ఎలక్ట్రిక్ బ్లూ’ యాక్ససరీస్ ఉన్నాయి. ఇందులో కొత్తగా రూపొందించిన 16-ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ ప్రీ-ఫేస్ లిఫ్ట్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయినప్పటికీ ఇది కొత్త టైల్ లైట్స్ యూనిట్ తో వస్తుంది. కానీ ఎలక్ట్రిక్ బ్లూ యాక్ససరీస్ బూట్‌లో కొనసాగుతున్నాయి.

టాటా నెక్సాన్ ఈవి యొక్క ఇంటీరియర్స్ విషయానికి వస్తే, దీని క్యాబిన్ మరియు డాష్‌బోర్డ్‌ మునుపటి కంటే ఎక్కువ ప్రీమియం చేయడానికి సూక్ష్మమైన నవీకరణలు ఇవ్వబడ్డాయి. టాటా నెక్సాన్ ఈవి డ్యూయల్-టోన్ క్యాబిన్‌తో వస్తుంది, డాష్‌బోర్డ్ మధ్యలో పియానో-బ్లాక్ ఫినిషింగ్ ఉంటుంది.

టాటా నెక్సన్ EV ఇంజన్ మరియు పనితీరు

టాటా నెక్సాన్ ఈవి 30.2kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జత చేసిన 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. కంపెనీ యొక్క సరికొత్త జిప్‌ట్రాన్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉన్న బ్రాండ్ నుండి వచ్చిన మొదటి మోడల్ ఇది.

ఎలక్ట్రిక్ మోటారు మరియు లిథియం-అయాన్ బ్యాటరీతో టాటా నెక్సాన్ ఈవిలోని కొత్త జిప్‌ట్రాన్ పవర్‌ట్రెయిన్ 128 బిహెచ్‌పి మరియు 245 బిహెచ్‌పి పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్‌తో జత చేయబడింది. టాటా మోటార్స్ నెక్సాన్ ఈవి 9.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది.

టాటా నెక్సన్ EV ఇంధన సామర్థ్యం

టాటా నెక్సాన్ ఈవి ఒకే ఛార్జీపై ఏఆర్ఏఐ ధృవీకరించబడిన విధంగా ఇది 312 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదై తెలుస్తోంది. అయితే వాస్తవ ప్రపంచలో ఒక చార్జితో 250 నుండి 300 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని తెలుస్తోంది.

టాటా నెక్సన్ EV ముఖ్యమైన ఫీచర్లు

టాటా మోటార్స్ నెక్సాన్ ఈవి అనేక ఫీచర్లు మరియు పరికరాలతో వస్తుంది. ఇది ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ ఓపెనర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 16 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, లెదర్ సీట్లు, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్‌లు, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ మరియు ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఈవిలోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఎబిడి, హిల్-యాస్సెంట్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, హై-స్పీడ్ వార్ణింగ్ వంటి మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.

టాటా నెక్సన్ EV తీర్పు

టాటా నెక్సాన్ ఈవి భారత మార్కెట్లో బాగా ఆకట్టుకునే ఎలక్ట్రిక్ కాంపాక్ట్-ఎస్‌యూవీ. టాటా మోటార్స్ దీనిని దేశీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా ట్యూన్ చేసింది. ఇది మంచి ఫీచర్స్, రైడింగ్ కంఫర్ట్ మరియు మంచి ఫెర్ఫామెన్స్ అందిస్తుంది. టాటా నెక్సాన్ ఈవి రోజువారీ ప్రయాణానికి ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది.

టాటా నెక్సన్ EV టాటా నెక్సన్ EV కలర్లు


Pristine White
Daytona Grey With White Roof
Ocean Blue With White Roof

టాటా నెక్సన్ EV ఎలక్ట్రిక్ కాంపిటీటర్స్

టాటా నెక్సన్ EV ఎలక్ట్రిక్ మైలేజ్ కంపారిజన్

  • విన్‌ఫాస్ట్ VF 6
    విన్‌ఫాస్ట్ VF 6
    local_gas_station ఎలక్ట్రిక్ | FWD
  • కియా సిరోస్ EV
    కియా సిరోస్ EV
    local_gas_station ఎలక్ట్రిక్ | FWD
  • మహీంద్రా XEV 9S
    మహీంద్రా XEV 9S
    local_gas_station ఎలక్ట్రిక్ | RWD

టాటా టాటా నెక్సన్ EV ఫోటోలు

టాటా నెక్సన్ EV Q & A

టాటా నెక్సాన్ ఈవి యొక్క వాస్తవ పరిధి ఎంత?

టాటా నెక్సాన్ ఈవి ఒకే ఛార్జీపై 250 నుంచి 300 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

Hide Answerkeyboard_arrow_down
టాటా నెక్సాన్ ఈవికి ప్రత్యర్థులు ఏమిటి?

టాటా నెక్సాన్ ఈవికి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. కానీ ఇది MG ZS EV మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
టాటా నెక్సాన్ ఈవిలో అందుబాటులో ఉన్న వేరియంట్లు ఏవి?

టాటా నెక్సాన్ ఈవిలో ఎక్స్ఎమ్, ఎక్స్‌జెడ్ ప్లస్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ ఎల్‌యుఎక్స్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
టాటా నెక్సాన్ ఈవి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్సన్ తో వస్తుందా?

వస్తుంది, టాటా నెక్సాన్ ఈవి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్సన్ లో అందుబాటులో ఉంటుంది, బ్యాటరీలను ఒక గంటలో 20% నుండి 80% వరకు ఛార్జ్ చేయగలదు.

Hide Answerkeyboard_arrow_down
టాటా నెక్సాన్ ఈవిలో ఉన్న డ్రైవింగ్ మోడ్‌లు ఎన్ని, అవి ఏవి?

టాటా నెక్సాన్ ఈవి రెండు డ్రైవింగ్ మోడ్‌లతో వస్తుంది. అవి ఎకో మరియు స్పోర్ట్ మోడ్‌లు.

Hide Answerkeyboard_arrow_down
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+