రెనాల్ట్ ట్రైబర్

రెనాల్ట్ ట్రైబర్
Style: ఎమ్‌యూవీ
5.69 - 8.25 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

రెనాల్ట్ ప్రస్తుతం 8 విభిన్న వేరియంట్లు మరియు 2 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. రెనాల్ట్ ట్రైబర్ ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, రెనాల్ట్ ట్రైబర్ ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా రెనాల్ట్ ట్రైబర్ మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి రెనాల్ట్ ట్రైబర్ గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

రెనాల్ట్ ట్రైబర్ పెట్రోల్ మోడళ్లు

రెనాల్ట్ ట్రైబర్ మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
పెట్రోల్ 18.29

రెనాల్ట్ ట్రైబర్ రివ్యూ

Rating :
రెనాల్ట్ ట్రైబర్ Exterior And Interior Design

రెనాల్ట్ ట్రైబర్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

భారత మార్కెట్లో రెనాల్ట్ కంపెనీ తన ట్రైబర్ ఎమ్‌పివి ప్రవేశపెట్టింది. సబ్-4 మీటర్ ఎమ్‌పివి ప్రపంచవ్యాప్తంగా జూన్ 2019 లో భారతదేశంలో ప్రదర్శించబడింది. రెనాల్ట్ ట్రైబర్ పూర్తిగా సరికొత్త డిజైన్‌తో వస్తుంది, ఇది దేశంలో బ్రాండ్ అందించే మునుపటి మోడళ్లకంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది.

ఈ ఎమ్‌పివి ముందు నుంచి ప్రారంభించి, పెద్ద ఫ్రంట్ గ్రిల్‌తో, సన్నని క్రోమ్ స్ట్రిప్‌తో వస్తుంది. ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్‌లతో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ద్వారా గ్రిల్ ఇరువైపులా ఉంటుంది. ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు ఫ్రంట్ బంపర్‌పై సి-షేప్ క్రోమ్ హౌసింగ్‌తో క్రిందికి ఉంచబడ్డాయి. బంపర్ పెద్ద సెంట్రల్ ఎయిర్ ఇంటేక్ మరియు సిల్వర్ స్కఫ్ ప్లేట్లతో వస్తుంది, ఇది కఠినమైన రూపాన్ని అందిస్తుంది.

ట్రైబర్ యొక్క సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్‌లో షోల్డర్ లైన్స్, 14 ఇంచెస్ డ్యూయల్-టోన్ వీల్ మరియు పైన ఫాక్స్ రూఫ్ రైల్స్ ఉంటాయి.

ఇక రియర్ ప్రొఫైల్‌ విషయానికి వస్తే, వెనుక బంపర్‌పై సొగసైన టైల్ లైట్స్ మరియు ఫాక్స్ స్కఫ్ ప్లేట్‌లతో శుభ్రమైన మరియు సరళమైన డిజైన్ కూడా ఉంది.

ట్రైబర్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది బ్లాక్ అండ్ లేత బీజ్ కలర్ డ్యూయల్ టోన్ క్యాబిన్‌ కలిగి ఉంటుంది. డాష్‌బోర్డ్ అదే డ్యూయల్-టోన్ థీమ్‌లో వస్తుంది, సిల్వర్ యాక్సెంట్స్ దీనిని మరింత ఆకర్షణీయంగా చూపిస్తుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు సెంటర్ కన్సోల్‌లో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే కూడా చాలా లగ్జరీ అనుభూతిని ఇస్తాయి.

రెనాల్ట్ ట్రైబర్ ఇంజన్ మరియు పనితీరు

రెనాల్ట్ ట్రైబర్ Engine And Performance

రెనాల్ట్ ట్రైబర్ సింగిల్ ఇంజన్ ఆప్సన్ తో అందించబడుతుంది. ఇందులో 72-బిహెచ్‌పి మరియు 96 ఎన్ఎమ్ పీక్ టార్క్ అందిస్తుంది. ఇందులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. రెనాల్ట్ తరువాతి దశలో AMT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

రెనాల్ట్ ట్రైబర్ ఇంధన సామర్థ్యం

రెనాల్ట్ ట్రైబర్ Fuel Efficiency

రెనాల్ట్ ట్రైబర్ సింగిల్ పెట్రోల్ ఇంజన్ సమర్పణతో వస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ లీటరుకు 20 కి.మీ మైలేజ్ అందిస్తుంది. ఇది 40 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది. ఇది ఒక ఫుల్ ట్యాంక్ తో దాదాపుగా 600 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

రెనాల్ట్ ట్రైబర్ ముఖ్యమైన ఫీచర్లు

రెనాల్ట్ ట్రైబర్ Important Features

రెనాల్ట్ ట్రైబర్ మంచి ఫెచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఎల్‌ఈడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కూల్డ్ స్టోరేజ్, స్మార్ట్ యాక్సెస్ కీకార్డ్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, కీలెస్ ఎంట్రీ, 2 వ మరియు 3 వ వరుసలో ఎసి వెంట్స్, ఎలక్ట్రికల్లీ-అడ్జస్టబుల్ ఓఆర్‌విఎంలతో కూడిన 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

రెనాల్ట్ ట్రైబర్ లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఎబిఎస్ విత్ ఇబిడి, డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ అలర్ట్ వార్ణింగ్, సీట్-బెల్ట్ రిమైండర్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ మరియు ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్‌ వంటివి కలిగి ఉంటుంది.

రెనాల్ట్ ట్రైబర్ తీర్పు

రెనాల్ట్ ట్రైబర్ Verdict

బడ్జెట్ ధర పరిధిలో హ్యాచ్‌బ్యాక్ కొనుగోలుచేయాలనుకునేవారికి ఈ రెనాల్ట్ ట్రైబర్ ఖచ్చితంగా సరిపోతుంది. ఈ కాంపాక్ట్ MPV మంచి స్పేస్, ఫీచర్స్ మరియు పనితీరును పుష్కలంగా అందిస్తుంది.

రెనాల్ట్ ట్రైబర్ రెనాల్ట్ ట్రైబర్ కలర్లు


Moonlight Silver
Ice Cool White

రెనాల్ట్ ట్రైబర్ పెట్రోల్ కాంపిటీటర్స్

రెనాల్ట్ ట్రైబర్ పెట్రోల్ మైలేజ్ కంపారిజన్

  • మారుతి సుజుకి ఎర్టిగా మారుతి సుజుకి ఎర్టిగా
    local_gas_station పెట్రోల్ | 19.01
  • డాట్సన్ గో ప్లస్ డాట్సన్ గో ప్లస్
    local_gas_station పెట్రోల్ | 18.57

రెనాల్ట్ రెనాల్ట్ ట్రైబర్ ఫోటోలు

రెనాల్ట్ ట్రైబర్ Q & A

రెనాల్ట్ ట్రైబర్‌లోని వేరియంట్లు ఏవి?

రెనాల్ట్ ట్రైబర్ ఆర్ఎక్స్ఈ, ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్టి మరియు ఆర్ఎక్స్జెడ్ అనే నాలుగు వేరియంట్ల పరిధిలో అందించబడుతుంది.

Hide Answerkeyboard_arrow_down
రెనాల్ట్ ట్రైబర్‌లో కలర్ ఆప్సన్ ఏమిటి?

రెనాల్ట్ ట్రైబర్‌ మెటల్ మస్టర్డ్, ఎలక్ట్రిక్ బ్లూ, ఫైరీ రెడ్, మూన్‌లైట్ సిల్వర్ మరియు ఐస్ కూల్ వైట్ అనే ఐదు కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
రెనాల్ట్ ట్రైబర్ బిఎస్ 6 నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ అయ్యిందా?

లేదు, రెనాల్ట్ ట్రైబర్‌ను ఒకే పెట్రోల్ ఇంజన్ ఆప్సన్ తో అందిస్తున్నారు, ఇది సమీప భవిష్యత్తులో BS-VI నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ అవుతుంది.

Hide Answerkeyboard_arrow_down
రెనాల్ట్ ట్రైబర్‌కు ప్రత్యర్థులు ఏవి?

రెనాల్ట్ ట్రైబర్ ధరల శ్రేణిలో డాట్సన్ గో ప్లస్, మారుతి స్విఫ్ట్ మరియు టాటా టియాగో వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
రెనాల్ట్ ట్రైబర్‌లో ప్రధాన లక్షణం ఏమిటి?

రెనాల్ట్ ట్రైబర్‌లోని ప్రధాన లక్షణం రిమూవబుల్ మూడవ వరుస సీట్లు.

Hide Answerkeyboard_arrow_down
రెనాల్ట్ ట్రైబర్ లో ఆటోమేటిక్ వేరియంట్ ఉందా?

లేదు, రెనాల్ట్ ట్రైబర్ ప్రస్తుతం మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ రెనాల్ట్ త్వరలో AMT వెర్షన్‌లో రానున్నట్లు ధ్రువీకరించింది.

Hide Answerkeyboard_arrow_down
భారతదేశంలో రెనాల్ట్ ట్రైబర్ అమ్మకాలు ఎలా ఉన్నాయి?

రెనాల్ట్ ట్రైబర్‌కు భారత మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. ఇది ప్రారంభించిన మొదటి రెండు నెలల్లో 10,000 యూనిట్ల వరకు అమ్మకాలు జరిపింది.

Hide Answerkeyboard_arrow_down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X