ఎంజి జెడ్ఎస్ ఇవి

ఎంజి జెడ్ఎస్ ఇవి
Style: ఎస్‌యూవీ
21.00 - 24.21 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

ఎంజి ప్రస్తుతం 2 విభిన్న వేరియంట్లు మరియు 2 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. ఎంజి జెడ్ఎస్ ఇవి ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, ఎంజి జెడ్ఎస్ ఇవి ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా ఎంజి జెడ్ఎస్ ఇవి మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి ఎంజి జెడ్ఎస్ ఇవి గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

ఎంజి జెడ్ఎస్ ఇవి ఎలక్ట్రిక్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎస్‌యూవీ | Gearbox
21,00,021
ఎస్‌యూవీ | Gearbox
24,21,227

ఎంజి జెడ్ఎస్ ఇవి మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
ఎలక్ట్రిక్ 0

ఎంజి జెడ్ఎస్ ఇవి రివ్యూ

Rating :
ఎంజి జెడ్ఎస్ ఇవి Exterior And Interior Design

ఎంజి జెడ్ఎస్ ఇవి ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

ఎంజి మోటార్స్ ఇండియా తమ మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన జెడ్ఎస్ ఈవిను 2020 జనవరిలో ప్రవేశపెట్టింది. ఎంజి జెడ్ఎస్ ఈవి బ్రాండ్ యొక్క రెండవ ఉత్పత్తి. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ ఎస్‌యూవీ డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో బ్రాండ్ యొక్క సిగ్నేచర్ ఒమేగా ఆకారంలో ఉన్న ఎల్ఈడీ డిఆర్ఎల్ లను ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మరియు ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్‌లతో వస్తుంది. హెడ్‌ల్యాంప్ క్లస్టర్ మధ్యలో ఒక క్రోమ్-ఫినిష్డ్ కాంకేవ్ గ్రిల్‌ను కలిగి ఉంది, ఇది ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం ఛార్జింగ్ పోర్ట్‌ను బహిర్గతం చేయడానికి పైకి వెళ్తుంది.

ఈ ఎస్‌యూవీ యొక్క సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది చాలా స్పోర్టి ఇంకా ప్రీమియం లుక్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, హౌసింగ్ 17- ఇంచెస్ ప్రత్యేకంగా రూపొందించిన అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వెనుక భాగం ఎల్‌ఈడీ టైల్ లైట్స్ కలిగి ఉంటాయి. రియర్ ప్రొఫైల్‌లో సైడ్ రిఫ్లెక్టర్ల చుట్టూ క్రోమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సిల్వర్ స్కఫ్ ప్లేట్‌తో వస్తుంది.

ఎంజి జెడ్ఎస్ ఈవి ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది సరళమైన డాష్‌బోర్డ్ లేఅవుట్‌తో వస్తుంది. క్యాబిన్ పూర్తిగా బ్లాక్-అవుట్ చేయబడింది, డాష్‌బోర్డ్‌లోని సిల్వర్ ఎలిమెంట్స్ కొద్దిగా విరుద్ధంగా ఉంటాయి. మధ్యలో ఉన్న పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డాష్‌కు ఫ్లష్‌లో ఉంటుంది, ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

ఎంజి జెడ్ఎస్ ఇవి ఇంజన్ మరియు పనితీరు

ఎంజి జెడ్ఎస్ ఇవి Engine And Performance

ఇది ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కావడంతో, ఎంజి జెడ్‌ఎస్ ఈవి బోనెట్ కింద 3 ఫేస్ పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటారుతో వస్తుంది. ఇది 44.5 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో 3,500 rpm వద్ద గరిష్టంగా 141 bhp మరియు 5,000 rpm వద్ద 353 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్‌తో జతచేయబడుతుంది.

ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ ప్రారంభం నుండే ఇన్స్టంట్ యాక్సలరేషన్ అందిస్తుంది. ఎంజి జెడ్‌ఎస్ ఈవి కూడా మూడు డ్రైవింగ్ మోడ్‌లతో అందించబడుతుంది. అవి ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ మోడ్స్. ఎంజి జెడ్‌ఎస్ ఈవి 8.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ / గం నుండి వేగవంతం చేయగలదని ఎంజి మోటార్స్ పేర్కొంది.

ఎంజి జెడ్ఎస్ ఇవి ఇంధన సామర్థ్యం

ఎంజి జెడ్ఎస్ ఇవి Fuel Efficiency

ఎంజి జెడ్‌ఎస్ ఈవి మైలేజ్ విషయానికి వస్తే, ఇది ఒకే ఛార్జ్ (ARAI- సర్టిఫైడ్) పై గరిష్టంగా 340 కిలోమీటర్లు పరిధిని అందిస్తుంది. కానీ వాస్తవ బాహ్య శ్రేణి వివిధ బాహ్య కారకాలు మరియు డ్రైవింగ్ శైలులను బట్టి 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

ఎంజి జెడ్ఎస్ ఇవి ముఖ్యమైన ఫీచర్లు

ఎంజి జెడ్ఎస్ ఇవి Important Features

ఎంజి జెడ్‌ఎస్ ఈవి అనేక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని కొన్ని ముఖ్య ఫీచర్స్ గమనించినట్లయితే, ఇందులో కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో కూడిన పెద్ద 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, త్రీ లెవెల్ కెఈఆర్ఎస్, ఫాలో-మీ-హోమ్ ఫంక్షన్‌తో ఆటో హెడ్‌ల్యాంప్‌లు, డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, పుష్ -బటన్ స్టార్ట్ స్టాప్, టిల్ట్ స్టీరింగ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్ ORVM లు మరియు బ్రీతబుల్ గ్లో లోగో వంటివి ఉన్నాయి.

ఎంజి జెడ్‌ఎస్ ఈవి లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ పార్కింగ్ కెమెరా, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్ మరియు ఎబిఎస్ విత్ ఇబిడి వంటివి ఉన్నాయి.

ఎంజి జెడ్ఎస్ ఇవి తీర్పు

ఎంజి జెడ్ఎస్ ఇవి Verdict

ఎంజి జెడ్‌ఎస్ ఈవి వినియోగదారులను చాలా ఆకర్శించేవిధంగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ డిజైన్ కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇది మంది పనితీరుని అందిస్తుంది. దీనితో పాటు ఫీచర్స్ మరియు కనెక్టివిటీ టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఎంజి జెడ్‌ఎస్ ఈవి భారత మార్కెట్‌కు ఖచ్చితంగా సరిపోయేవిధంగా ఉంటుంది.

ఎంజి జెడ్ఎస్ ఇవి ఎంజి జెడ్ఎస్ ఇవి కలర్లు


Currant Red
Ferris White

ఎంజి జెడ్ఎస్ ఇవి ఎలక్ట్రిక్ కాంపిటీటర్స్

ఎంజి జెడ్ఎస్ ఇవి ఎలక్ట్రిక్ మైలేజ్ కంపారిజన్

  • హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్
    local_gas_station ఎలక్ట్రిక్ | 0

ఎంజి ఎంజి జెడ్ఎస్ ఇవి ఫోటోలు

ఎంజి జెడ్ఎస్ ఇవి Q & A

భారత మార్కెట్లో ఎంజి జెడ్‌ఎస్ ఈవి కి ప్రత్యర్థులు ఏవి?

భారతీయ మార్కెట్లో ఎంజి జెడ్‌ఎస్ ఈవి, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
ఎంజి జెడ్‌ఎస్ ఈవిలోని స్టాండ్-అవుట్ ఫీచర్స్ ఏవి?

ఎంజి జెడ్‌ఎస్ ఈవిలోని స్టాండ్-అవుట్ ఫీచర్ దాని ఐ-స్మార్ట్ కనెక్టివిటీ టెక్నాలజీ, ఇది 5 జి-ఎనేబుల్డ్ ఇ-సిమ్‌తో వస్తుంది, ఇది కనెక్టెడ్ ఫీచర్స్ మరియు ఫంక్షనాలిటీస్ అందిస్తుంది.

Hide Answerkeyboard_arrow_down
ఎంజి జెడ్‌ఎస్ ఈవి యొక్క వాస్తవ ప్రపంచంలో దాని మైలేజ్ ఎంత?

ఎంజి జెడ్‌ఎస్ ఈవి ఒకే ఛార్జీపై 280 నుండి 320 కిలోమీటర్ల మధ్య అందించగలదు.

Hide Answerkeyboard_arrow_down
ఎంజి జెడ్‌ఎస్ ఈవిలో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్సన్ ఉందా?

ఉంది, ఎంజి మోటార్స్ జెడ్ఎస్ ఈవి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కలిగి ఉంది, ఇది స్టాండర్డ్ గా వస్తుంది.

Hide Answerkeyboard_arrow_down
ఎంజి జెడ్‌ఎస్ ఈవిలోని వేరియంట్స్?

ఎంజి జెడ్‌ఎస్ ఈవి రెండు వేరియంట్లలో అందించబడుతుంది. అవి ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ వేరియంట్స్.

Hide Answerkeyboard_arrow_down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X