టాటా టియాగో

టాటా టియాగో
Style: హ్యాచ్‌బ్యాక్
5.20 - 7.65 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

టాటా ప్రస్తుతం 15 విభిన్న వేరియంట్లు మరియు 5 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. టాటా టియాగో ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, టాటా టియాగో ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా టాటా టియాగో మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి టాటా టియాగో గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

టాటా టియాగో పెట్రోల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
5,19,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
5,64,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
5,79,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
6,19,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
6,34,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
6,62,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
6,74,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
6,74,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
7,17,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
7,29,900

టాటా టియాగో సిఎన్‌జి మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
6,09,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
6,39,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
6,69,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
7,52,900
హ్యాచ్‌బ్యాక్ | Gearbox
7,64,900

టాటా టియాగో మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
పెట్రోల్ 23.84
సిఎన్‌జి 0

టాటా టియాగో రివ్యూ

Rating :
టాటా టియాగో Exterior And Interior Design

టాటా టియాగో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

భారత మార్కెట్లో టాటా టియాగో ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్. ఇది నెల నెలా మంచి అమ్మకాలతో ముందుకు వెళ్తోంది. టాటా టియాగో బ్రాండ్ యొక్క సరికొత్త ‘ఇంపాక్ట్ 2.0’ డిజైన్ లాంగ్వేజ్ తో మంచి డిజైన్ కలిగి ఉంటుంది.

టాటా టియాగో యొక్క డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగం అప్డేటెడ్ ఫ్రంట్ ఎండ్‌తో వస్తుంది. కొత్త డిజైన్ దాని ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ నుండి ప్రేరణ పొందింది. ఇందులో అప్‌డేటెడ్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ యూనిట్లు, పియానో-బ్లాక్ ఫినిష్డ్ ఫ్రంట్ గ్రిల్ మరియు ట్రై-యారో డిజైన్ ఎలిమెంట్ ఉన్నాయి. హెడ్‌ల్యాంప్‌లు ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ కోణీయంగా ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ కూడా అప్‌డేట్ చేయబడింది. ఫాగ్ లాంప్ హౌసింగ్‌తో పాటు బంపర్‌పై కూడా ఉంచబడింది.

టాటా టియాగో యొక్క సైడ్ మరియు రియర్ ప్రొఫైల్‌ విషయానికి వస్తే, ఇక్కడ కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్, షార్ప్ లైన్స్ మరియు క్రేజులతో మరియు ఎల్‌ఈడీ టైల్ లైట్స్ తో అప్డేట్ చేయబడి ఉంటుంది. ఇవన్నీ హ్యాచ్‌బ్యాక్‌ను మరింత స్పోర్టిగా చేస్తాయి.

టాటా టియాగో యొక్క లోపలి భాగంలో కూడా గణనీయమైన మార్పులు జరిగాయి. ఇందులో రిఫ్రెష్ చేసిన క్యాబిన్ మరియు డాష్‌బోర్డ్ లేఅవుట్ చాలా ఖరీదైన మరియు ప్రీమియం అనుభూతిని ఇస్తుంది.

టాటా టియాగో ఇంజన్ మరియు పనితీరు

టాటా టియాగో Engine And Performance

టాటా టియాగో సింగిల్ ఇంజిన్ ఎంపికతో అందించబడుతుంది, ఇది బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయడం జరిగింది. ఇది 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ రూపంలో వస్తుంది. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద 83 బిహెచ్‌పి మరియు 3300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్‌తో జతచేయబడుతుంది.

టాటా టియాగో ఇంధన సామర్థ్యం

టాటా టియాగో Fuel Efficiency

టాటా టియాగో 35 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది. ఇది ఏఆర్ఏఐ ధృవీకరించబడినదాని ప్రకారం ఇది ఒక లీటరుకు 23 కి.మీ మైలేజ్ అందిస్తుంది. ఇది చాలా వరకు మంచి మైలేజ్ అనే చెప్పాలి. ఇది సుదూర ప్రయాణం చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

టాటా టియాగో ముఖ్యమైన ఫీచర్లు

టాటా టియాగో Important Features

టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కాస్మెటిక్ అప్‌డేట్స్ మాత్రమే కాకుండా, ఇదిలా అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలు ఉన్నాయి. టాటా టియాగోలోని కొన్ని ఫీచర విషయానికి వస్తే, ఇందులో ట్రై యారో థీమ్ థీమ్‌తో ప్రీమియం సీట్ అప్హోల్స్ట్రే, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, 15-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ టైల్ లైట్స్, 8-స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్‌వ్యూ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, హై-స్పీడ్ అలర్ట్ వంటివి ఉన్నాయి.

టాటా టియాగో తీర్పు

టాటా టియాగో Verdict

టాటా టియాగో ఈ విభాగంలో ఎల్లప్పుడూ ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ సమర్పణ. డిజైన్, పర్ఫామెన్స్, కంఫర్ట్ ఫీచర్స్ మరియు పరికరాలతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. టియాగో పనితీరు మరియు సౌకర్యం మధ్య మంచి సమతుల్యతను అందిస్తుంది.

టాటా టియాగో టాటా టియాగో కలర్లు


Midnight Plum
Arizona Blue
Daytona Grey
Flame Red
Opal White

టాటా టియాగో పెట్రోల్ కాంపిటీటర్స్

టాటా టియాగో సిఎన్‌జి కాంపిటీటర్స్

టాటా టియాగో పెట్రోల్ మైలేజ్ కంపారిజన్

 • మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్‌టి మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్‌టి
  local_gas_station పెట్రోల్ | 0
 • వోక్స్‌వ్యాగన్ పోలో వోక్స్‌వ్యాగన్ పోలో
  local_gas_station పెట్రోల్ | 18.24
 • మారుతి సుజుకి స్విఫ్ట్ మారుతి సుజుకి స్విఫ్ట్
  local_gas_station పెట్రోల్ | 23.76

టాటా టియాగో సిఎన్‌జి మైలేజ్ కంపారిజన్

 • హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
  local_gas_station సిఎన్‌జి | 18.9
 • మారుతి సుజుకి న్యూ-జెన్ సెలెరియో మారుతి సుజుకి న్యూ-జెన్ సెలెరియో
  local_gas_station సిఎన్‌జి | 0

టాటా టాటా టియాగో ఫోటోలు

టాటా టియాగో Q & A

టాటా టియాగోలో ఉన్న వేరియంట్లు ఏవి?

టాటా టియాగోను XE, XT, XZ, XZ +, XZA మరియు XZA + వేరియంట్లలో అందిస్తున్నారు.

Hide Answerkeyboard_arrow_down
టాటా టియాగోలోని కలర్ ఆప్సన్స్ ఏవి?

టాటా టియాగో ఆరు కలర్ ఆప్సన్స్ తో అందించబడుతుంది. అవి పియర్సెంట్ వైట్, ఫ్లేమ్ రెడ్, విక్టరీ ఎల్లో, ప్యూర్ సిల్వర్, టెక్టోనిక్ బ్లూ & డేటోనా గ్రే కలర్స్.

Hide Answerkeyboard_arrow_down
టాటా టియాగో యొక్క ప్రత్యర్థులు ఏవి?

టాటా టియాగో ఫోర్డ్ ఫిగో, మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు డాట్సన్ గో వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
టాటా టియాగో డీజిల్ ఇంజిన్‌తో వస్తుందా?

రాదూ, టాటా టియాగోను ఒకే బిఎస్-6 కంప్లైంట్ NA పెట్రోల్ ఇంజిన్‌తో అందిస్తున్నారు.

Hide Answerkeyboard_arrow_down
టాటా టియాగో యొక్క మైలేజ్ ఎంత?

టాటా టియాగో యొక్క వాస్తవ-ప్రపంచంలో లీటరుకు 18 కి.మీ నుంచి 20 కి.మీ మధ్య అందిస్తుంది.

Hide Answerkeyboard_arrow_down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X