మారుతి సుజుకి సియాజ్

మారుతి సుజుకి సియాజ్
Style: సెడాన్
8.87 - 11.86 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

మారుతి సుజుకి ప్రస్తుతం 8 విభిన్న వేరియంట్లు మరియు 7 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. మారుతి సుజుకి సియాజ్ ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, మారుతి సుజుకి సియాజ్ ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా మారుతి సుజుకి సియాజ్ మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి మారుతి సుజుకి సియాజ్ గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

మారుతి సుజుకి సియాజ్ పెట్రోల్ మోడళ్లు

మారుతి సుజుకి సియాజ్ మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
పెట్రోల్ 20.04

మారుతి సుజుకి సియాజ్ రివ్యూ

Rating :
మారుతి సుజుకి సియాజ్ Exterior And Interior Design

మారుతి సుజుకి సియాజ్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

భారత మార్కెట్లో మారుతి సుజుకి సియాజ్ కంపెనీ యొక్క ప్రధాన మోడల్. సియాజ్ సెడాన్ ఇటీవల భారత మార్కెట్లో అప్డేట్ చేయబడింది. ఇది మునుపటి మోడల్‌తో పోలిస్తే అనేక కాస్మొటిక్ అప్డేట్స్ కలిగి చాలా అధునాతనంగా ఉంటుంది.

మారుతి సుజుకి సియాజ్ కొత్త డిజైన్‌తో వస్తుంది, ఇందులో క్రోమ్ పునర్నిర్మించిన గ్రిల్ ఉంది. ఫ్రంట్ గ్రిల్ ఇప్పుడు అప్‌డేట్ చేసిన ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మరియు డిఆర్‌ఎల్‌లను కలిగి ఉంటుంది. మారుతి సుజుకి ఫ్రంట్ బంపర్‌ను కూడా అప్‌డేట్ చేయబడింది. ఇది ఇప్పుడు ఫాగ్ లాంప్స్ కూడా కలిగి ఉంది. ఫాగ్ లాంప్స్ పై క్రోమ్ చుట్టూ, బంపర్ లార్జ్ ఎయిర్ ఇన్టేక్ కలిగి ఉంటుంది.

మారుతి సుజుకి సియాజ్ యొక్క సేడ్ ప్రొఫైల్ మరియు రియర్ ప్రొఫైల్ దాదాపుగా మార్దహు అలాగే ఉంటుంది. సియాజ్ సెడాన్ ఇప్పుడు 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది, వెనుక భాగంలో అప్‌డేట్ చేయబడిన ర్యాప్-చుట్టూ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లను పొందుతుంది.

మారుతి సుజుకి సియాజ్ యొక్క లోపలి భాగంలో అద్భుతమైన క్యాబిన్ ఉంటుంది. ఈ సెడాన్ ప్రీమియం అనుభూతిని పెంచడానికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఫాక్స్ వుడ్ ఇన్సర్ట్‌లపై కొత్త 4.2 ఇంచెస్ టిఎఫ్‌టి స్క్రీన్‌తో వస్తుంది.

మారుతి సుజుకి సియాజ్ ఇంజన్ మరియు పనితీరు

మారుతి సుజుకి సియాజ్ Engine And Performance

మారుతి సుజుకి సియాజ్ రెండు కొత్త ఇంజన్లతో పనిచేస్తుంది. అవి 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్. కొత్త 1.5-లీటర్ కె 15 బి పెట్రోల్ ఇంజన్ 104 బిహెచ్‌పి మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది.

ఇక 1.5-లీటర్ డిడిఐఎస్225 డీజిల్ యూనిట్ విషయానికి వస్తే, ఇది 94 బిహెచ్‌పి మరియు 225 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొత్త డీజిల్ ఇంజిన్ మారుతి సుజుకి యొక్క కొత్త 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడింది. మారుతి సుజుకి సియాజ్ లో పాత 1.3-లీటర్ డీజిల్ యూనిట్ 88 బిహెచ్‌పి మరియు 200 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ఒకే 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మారుతి సుజుకి సియాజ్ ఇంధన సామర్థ్యం

మారుతి సుజుకి సియాజ్ Fuel Efficiency

మారుతి సుజుకి సియాజ్ ప్రస్తుతం మూడు ఇంజన్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది 43 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో ఉంటుంది. ఇందులోని పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 21.56 కి.మీ పరిధిని, పెట్రోల్-ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 20.28 కి.మీ పరిధిని మరియు కొత్త 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ లీటరుకి 26.82 కి.మీ మైలేజ్ అందిస్తుంది.

మారుతి సుజుకి సియాజ్ ముఖ్యమైన ఫీచర్లు

మారుతి సుజుకి సియాజ్ Important Features

మారుతి సుజుకి కొత్త సియాజ్ చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా అప్డేటెడ్ పరికరాలను కూడా కలిగి ఉంటుంది. కొత్త మారుతి సుజుకి సియాజ్ సెడాన్ ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఇడి రియర్ కాంబినేషన్ లాంప్స్, లెదర్ సీట్లు మరియు స్టీరింగ్ అపోల్స్ట్రే, ఇంటెలిజెంట్ కీ (పుష్ స్టార్ట్ / స్టాప్), ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్ & ఫోల్డబుల్ ఓఆర్‌విఎమ్ లు, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వాయిస్ కమాండ్ సిస్టమ్ మరియు స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి.

మారుతి సుజుకి సియాజ్‌లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఈబిడి, రివర్స్ పార్కింగ్ కెమెరా, సీట్-బెల్ట్ రిమైండర్‌లు, హై-స్పీడ్ వార్ణింగ్ సిస్టం, యాంటీ-తెఫ్ట్ సిస్టమ్, డే అండ్ నైట్ ఐఆర్‌విఎం, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మరియు హిల్ హోల్డ్ వంటివి ఉన్నాయి.

మారుతి సుజుకి సియాజ్ తీర్పు

మారుతి సుజుకి సియాజ్ Verdict

భారత మార్కెట్లో మారుతి సుజుకి సియాజ్ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటి. సియాజ్ సెడాన్ మార్కెట్లో ప్రసిద్ధ కారు, మంచి పనితీరుని అందించడమే కాకుండా మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ కారు మంచి మైలేజ్ కూడా అందిస్తుంది. కావున లాంగ్ డ్రైవ్ కి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

మారుతి సుజుకి సియాజ్ మారుతి సుజుకి సియాజ్ కలర్లు


Pearl Midnight Black
Nexa Blue
Metallic Magma Gray
Pearl Metallic Dignity Brown
Pearl Sangria Red
Metallic Premium Silver
Pearl Arctic White

మారుతి సుజుకి సియాజ్ పెట్రోల్ కాంపిటీటర్స్

మారుతి సుజుకి సియాజ్ పెట్రోల్ మైలేజ్ కంపారిజన్

  • వోక్స్‌వ్యాగన్ వెంటో వోక్స్‌వ్యాగన్ వెంటో
    local_gas_station పెట్రోల్ | 16.35
  • స్కొడా రాపిడ్ టిఎస్ఐ స్కొడా రాపిడ్ టిఎస్ఐ
    local_gas_station పెట్రోల్ | 16.24
  • హోండా సిటీ హోండా సిటీ
    local_gas_station పెట్రోల్ | 17.8

మారుతి సుజుకి మారుతి సుజుకి సియాజ్ ఫోటోలు

మారుతి సుజుకి సియాజ్ Q & A

మారుతి సుజుకి సియాజ్ సెడాన్ యొక్క ధర సరైనదేనా?

అవును, మారుతి సుజుకి సియాజ్ మంచి పనితీరు, మంచి ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది, అంతే కాకుండా వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది కావున, ధర సరైనదే.

Hide Answerkeyboard_arrow_down
భారత మార్కెట్లో మారుతి సుజుకి సియాజ్‌కు ప్రత్యర్థులు ఏవి?

మారుతి సుజుకి సియాజ్ హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు స్కోడా రాపిడ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
కొత్త మారుతి సుజుకి సియాజ్ హైబ్రిడ్ సిస్టంతో వస్తుందా?

వస్తుంది, మారుతి సుజుకి సియాజ్ పెట్రోల్ బ్రాండ్ యొక్క SHVS సిస్టమ్‌తో అందించబడుతుంది.

Hide Answerkeyboard_arrow_down
కొత్త మారుతి సుజుకి సియాజ్ యొక్క వాస్తవ మైలేజ్ ఎంత?

మారుతి సుజుకి సియాజ్ యొక్క వాస్తవ మైలేజ్ పెట్రోల్‌ వేరియంట్ 20 కి.మీ / లీ మరియు డీజిల్‌ వేరియంట్ 23 కి.మీ / లీ వరకు ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
మారుతి సుజుకి సియాజ్ లేదా హోండా సిటీలో ఏది మంచిది?

డ్రైవింగ్ పరంగా హోండా సిటీ మంచి ఎంపిక, అయితే, మారుతి సుజుకి సియాజ్ వెచ్చించిన ధరకు ఖచ్చితంగా సరిపోతుంది.

Hide Answerkeyboard_arrow_down
మారుతి సుజుకి సియాజ్ ఇప్పటికీ పాత 1.3-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉందా?

ఉంది, మారుతి సుజుకి సియాజ్ ప్రస్తుతం పాత ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. అయితే, కొత్త ఉద్గార నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, బ్రాండ్ పాత డీజిల్ యూనిట్‌ను నిలిపివేస్తుంది.

Hide Answerkeyboard_arrow_down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X