ఆటో ఎక్స్‌పోలో ఏ-స్టార్ కన్వర్టిబల్‌ను ప్రదర్శించిన మారుతి
ఇటీవల ముగిసిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా విస్తృత స్థాయి ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచింది. ప్రస్తుతం భారత మార్కెట్లో లభ్యమవుతున్న మోడళ్లతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్లలో కంపెనీ అందిస్తున్న వివిధ మోడళ్లను కూడా మారుతి సుజుకి ఇండియా ప్రదర్శనకు ఉంచింది.
పై చిత్రంలో కనిపిస్తున్న కారును గమనించారా.. ఇదేదో స్పోర్ట్ కారో లేక సూపర్ కారో కాదు. ఇది మారుతి సుజుకి అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ కారు 'ఏ-స్టార్'. ఇదొక కన్వర్టిబల్ వేరియంట్. రెండు డోర్లతో అధిక స్పోర్టీ స్టయిల్ ఉట్టిపడే విధంగా పసుపు, నలుపు రంగుతో కూడిన బాడీ గ్రాఫిక్స్, ఇంటీరియర్స్‌తో కంపెనీ ఈ కారును అభివృద్ధి చేసింది. కంపెనీ ప్రదర్శించిన చిన్న కార్లలోలెకల్లా ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications








