మారుతి ఏ-స్టార్ కన్వర్టిబల్ ఇండియాకు వస్తుందా..?
మారతి సుజుకి ఏ-స్టార్ హ్యాచ్‌బ్యాక్ కారును గతంలో ఎన్నడూ ఈ విధంగా చూడలేదు. కేవలం ఒక్క బటన్ నొక్కగానే కారు టాప్ మొత్తం వెనక్కు ముడుచుకొని ఓపెన్ టాప్‌గా మారిపోతుంది. పెద్ద లగ్జరీ కార్లలో మాత్రమే కన్వర్టిబల్ ఆప్షన్ ఇంతటి చిన్న కారులో కూడా ఉండటం విశేషం.
కాగా.. మారుతి సుజుకి ప్రదర్శించిన ఏ-స్టార్ కన్వర్టిబల్ ఇండియన్ వెర్షన్ కారే. ఎందుకంటే ఇది కుడిచేతి వాటం డ్రైవింగ్‌ను కలిగి ఉంది (పై ఫోటోలో గమనించవచ్చు).
అయితే, ఇది ప్రొడక్షన్ వెర్షన్ మాత్రం కాదని తెలుస్తోంది. ఎందుకంటే ప్రీమియం ఇంటీరియర్స్‌తో కన్వర్టిబల్ కారును రూపొందించాలంటే కాస్తంత ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి ఇప్పట్లో ఇది ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశాలు కనబడటం లేదు.
మరి ఇంత మంచి క్యూట్ కారును మారుతి సుజుకి భారత మార్కెట్లో విడుదల చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే. దీనికి సంబంధించి ఇంత వరకూ కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏ-స్టార్ కన్వర్టిబల్‌కు సంబంధించి మరిన్న చిత్రాల కోసం డ్రైవ్‌స్పార్క్ ఫోటో గ్యాలరీని సందర్శించండి.


Click it and Unblock the Notifications








