ఆటో ఎక్స్‌పో 2012: హోండా సిబిఆర్ 150ఆర్ ఆవిష్కరణ
హోండా నుండి లభిస్తున్న స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ సిబిఆర్‌లో మరో కొత్త వేరియంట్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఇప్పటి వరకూ 250సీసీ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తున్న హోండా సిబిఆర్ 250ఆర్ ఇకపై 150సీసీ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యం కానుంది. ఈ మేరకు, న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో "హోండా సిబిఆర్ 150ఆర్" బైక్‌ను ప్రదర్శించింది.
భారత్‌లో ఇప్పటి వరకూ హోండా సిబిఆర్ 250ఆర్ బైక్ చీప్ అండ్ బెస్ట్ స్పోర్ట్స్ బైక్‌గా ఉంది. కాగా.. హోండా సిబిఆర్ 150ఆర్ మరింత చవక ధరకే లభ్యం కానుంది. నిజమైన రేసింగ్ అనుభూతినిచ్చేలా కంపెనీ ఈ మోడల్‌ను డిజైన్ చేసింది. సరికొత్త గ్రాఫిక్స్‌తో చూడటానికి అచ్చం హోండా సిబిఆర్ 250ఆర్ బైక్‌ను తలపించేలా ఉండే డిజైన్‌తో బైక్ లవర్స్‌ను ఇది ఆకట్టుకోనుంది.


Click it and Unblock the Notifications








