ఆటో ఎక్స్‌పో 2012: హోండా సిబిఆర్ 150ఆర్ ఆవిష్కరణ
హోండా సిబిఆర్ 150ఆర్‌లో ఉపయోగించిన తేలిక బరువును కలిగి ఉండి, చిన్నదిగా ఉంటుంది. ఇందులో డిఓహెచ్‌సి 150సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 10,500 ఆర్‌పిఎమ్ వద్ద 18 బిహెచ్‌పిల శక్తిని, 7500 ఆర్‌పిఎమ్ వద్ద 12.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇటు సిటీ రైడింగ్‌కు, అటు హైవే రైడింగ్‌కు ఈ వపర్ చక్కగా సరిపోతుంది.
హోండా సిబిఆర్ 150ఆర్ నిర్మాణంలో ట్విన్ ట్యూబ్లర్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ఇది కూడా సిబిఆర్ 250ఆర్ మాదిరిగానే వెనుకవైపు మోనో సస్పెన్షన్ (సింగిల్ షాక్ అబ్జార్వర్)ను కలిగి ఉంటుంది. అయితే, ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) లేదు. ఏబిఎస్ స్థానంలో ముందు వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లను ఉపయోగించారు. అలాగే ముందు, వెనుక విశాలమైన ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చారు.
హోండా సిబిఆర్ 150ఆర్‌లో ఉపయోగించిన అడ్వాన్స్ ఓ2 సెన్సార్, ఎయిర్ ఇండక్టర్‌లు తక్కువ కర్బన ఉద్ఘారాలను వెలువడేలా చేస్తాయి. ఇది స్టాండర్డ్, డీలక్స్ అనే రెండు వేరియంట్లలో, రెండు రంగులలో లభ్యం కానుంది. హోండా సిబిఆర్ 150ఆర్‌ను వాణిజ్య పరంగా ఎప్పుడు మార్కెట్లోకి విడుదల చేసే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇక దీని ధర విషయానికి వస్తే, ఇది రూ.1.2 లక్షలకు దిగువన ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








