ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి ఎర్టిగా విడుదల
హ్యాచ్‌బ్యాక్, సెడాన్ సెగ్మెంట్లలో దూసుకుపోతున్న దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తమ తొలి బహుళ ప్రయోజన వాహనం (మల్టీ పర్సపర్ వెహికల్) "ఎర్టిగా" విడుదలతో యుటిలిటీ సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించినట్లయింది. ప్రస్తుతం ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 2012 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ తొలిసారిగా ప్రొడక్షన్ వెర్షన్ ఎర్టిగా ఎమ్‌పివిని మార్కెట్‌కు పరిచయం చేసింది.
గడచిన 2010 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ తమ ఎమ్‌పివి కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. కాగా.. ప్రస్తుతం కంపెనీ విడుదల చేసిన ఎర్టిగా ఎమ్‌పివి ప్రొడక్షన్ వెర్షన్‌కు సంబంధించినది. రానున్న మార్చి నెల చివరి భాగంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో మారుతి సుజికి ఎర్టిగా ఎమ్‌పివి మార్కెట్లో వాణిజ్య పరంగా లభ్యం కానుంది. ఇందులో నెక్స్ట్ జనరేషన్ కె-సిరీస్ 1.4 లీటర్ వివిటి ఇంజన్‌ను అమర్చారు.
మరిన్ని ఫోటోలు, సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








