ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హల్ చల్ చేసిన టాటా పిక్సెల్
టాటా పిక్సెల్‌లో జీరో టర్న్, ఇన్ఫైనేట్లీ వేరియబుల్ ట్రాన్సిమిషన్ (ఐవిటి) అనే అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానాలు, 'మై టాటా కనెక్ట్' అనే స్మార్ట్ ఫోన్ ఆప్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 'మై టాటా కనెక్ట్' అనే ఫీచర్ టాటా మోటార్స్ అందిస్తున్న తొలి హ్యూమన్-మెషీన్ ఇంటర్‌ఫేస్ కాన్సెప్ట్ (హెచ్ఎమ్ఐ).

టాటా పిక్సెల్ కాన్సెప్ట్ కారులో 1.2 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించడం జరిగింది. ఇందులో కూడా టాటా నానో మాదిరిగానే ఇంజన్ వెనుకవైపు ఉంటుంది. ఇంజన్ ఓవర్‌హీట్‌ను అరిక్టేందుకు అవసరమయ్యే ఆధునిక కూలెంట్ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు.
టాటా పిక్సెల్ ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు గానూ అనుకూలమైన టైర్లు, స్టాప్-స్టార్ట్ టెక్నాలజీ, ఇంటలిజెంట్ బ్యాటరీ చార్జింగ్ వంటి ఫీచర్లను పొందుపరచారు. ఇది కిలోమీటరుకు 89 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్‌ను విడుదల చేస్తుంది.


Click it and Unblock the Notifications








