ఢిల్లీ ఆటో ఎక్స్‌పో: టాటా పిక్సెల్ కాన్సెప్ట్ ప్రదర్శన
గడచిన మార్చి నెలలో జెనీవాలో జరిగిన "81వ జెనీవా మోటార్ షో"లో టాటా మోటార్స్ తొలిసారిగా పిక్సెల్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. భవిష్యత్ రవాణా వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కంపెనీ ఈ కారును రూపొందించింది.

కేవలం మూడు మీటర్ల పొడవు మాత్రమే ఉండే ఈ కారులో నలుగురు హాయిగా ప్రయాణించవచ్చు. ప్రత్యేకించి యూరప్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని టాటా మోటార్స్ ఈ పిక్సెల్ కాన్సెప్ట్ కారును డిజైన్ చేసింది. ఇందులో మూడు డోర్లు, నాలుగు సీట్లు ఉండి, కారు రెండు డోర్లు కత్తెరలా పైవైపుకు (సిజర్ డోర్స్) తెరచుకునే విధంగా ఉంటాయి.


Click it and Unblock the Notifications








