హీరో మాయెస్ట్రో ఎడ్జ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ....
హీరో మోటోకార్ప్ వారు భారతీయ స్కూటర్ మార్కెట్లోకి సెప్టెంబర్ 29 న రెండు నూతన స్కూటర్లను విడుదల చేసింది. స్కూటర్ల మార్కెట్లో తమదైన ముద్ర వేసుకున్న హీరోమోటో కార్ప్ వారు విసృత శ్రణిలో వాహనాలను అందిస్తున్నారు.
హీరో వారి మాయెస్ట్రో ఎడ్జ్ మరియు డ్యూయెట్ స్కూటర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటికి సంభందించిన ఫస్ట డ్రైవ్ వివరాలు, లాభాలు మరియు నష్టాలు వంటి విషయాల గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం.

ఇంజన్
హీరోమోటో కార్ప్ వారు అభిృద్ది పరిచిన సరికొత్త 110.9 సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను ఇందులో అందించారు.

గేర్ బాక్స్ మరియు పవర్
మాయెస్ట్రో ఎడ్జ్ 8.31 బిహెచ్‌పి పవర్ మరియు 8.30 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది ఆటోమేటిక్ క్లచ్ గల వేరియోమ్యాటిక్ డ్రైవ్‌ను కలదు.

మైలేజ్
హీరో మోటో కార్ప్ వారి కథనం ప్రకారం ఇది 63.8 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. కాని దీనిని రోడ్ల మీద పరీక్షించినపుడు లీటర్‌కు 5 5 కిలో మీటర్లు మైలేజ్ ఇచ్చినట్లు తెలిసింది.

డిజైన్
హీరో మోటో కార్ప్ వారు దీనిని డిజైన్ పరంగా బాగానే అభివృద్ది చేశారు. దీని డిజైన్ చూస్తే చాలా వరకు ఎన్నో నూతన మార్పులు చోటు చేసుకున్నాయి.

టెయిల్ ల్యాంప్ డిజైన్
ఇక్కడ ఉన్న టెయిల్ ల్యాంప్‌ను గమనిస్తే చాలా పదునుగా ఉండే విధంగా డిజైన్ చేశారు. మరియు దీని ముందు వైపు డిజైన్ కండలు తిరిగిన శరీరాకృతిని గుర్తు చేస్తుంది.

ఫీచర్లు
ఫీచర్ల విషయంలో హీరోమోటో కార్ప్ వారు ఇందులో ఎక్కువ సౌకర్యం కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మీరు ఫూయల్ ట్యాంక్ మూతను తీయడానికి ముందు వైపు కీ వద్ద లాక్ ఓపెన్ అవకాశం కల్పించారు. ఈ కీ ఆపరేట్ దగ్గర మీరు గమనించినట్లయితే అక్కడ వివిధ రకాల ఆప్షన్లను ఇచ్చారు.

స్టోరేజ్
మాయెస్ట్రో ఎడ్జ్ లో దాదాపుగా 22 లీటర్లు కెపాసిటి గల అండర్ సీట్ స్టోరేజ్ కలదు. మరియు దీనిలో ఒక పెద్ద సైజు హెల్మెట్‌ను కూడా స్టోర్ చేయవచ్చు.

మరిన్ని ఫీచర్లు
ఈ అండర్ సీట్ స్టోరేజ్‌తో పాటు హీరో వారు ఇందులో ఇంకా రెండు ఫీచర్లను కల్పించారు. యుయస్‍బి 3.0 సెల్ ఫోన్ ఛార్జర్ మరియు స్టోరేజ్ స్థలంలో ఏవేవి ఉన్నాయో తెలుసుకోవడానికి అందులో ఒక లైటును ఏర్పాటు చేశారు.

అనలాగ్ మీటర్
సరికొత్త మాయెస్ట్రోలో అనలాగ్/డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్ కలగదు. దీని ద్వారా స్పీడ్, సైడ్ స్టాండ్ హెచ్చరిక, ఎప్పుడు సర్వీసింగ్ చేయావలో, ఒడో మీటర్, ట్రిప్ మీటర్ మరియు ఎంత ఇంధన కలదో వంటి విషయాలన్ని తెలుసుకోవచ్చు.

భద్రత
హీరో మోటోకార్ప్ వారు ఈ మాయెస్ట్రో స్కూటర్‍లో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్‌ని కల్పించారు. అయితే బ్రేకులను అతి బలవంతంగా ఆపరేట్ చేసినపుడు ఇది సరైన ఫలితాన్ని ఇవ్వలేదని తెలిసింది.

పాస్ లైట్
సాధారణంగా ఇలాంటి ఫీచర్‌ను మనం బైకులలో మాత్రమే చూసుంటాం. కాని దేశ వ్యాప్తంగా గల స్కూటర్‌లలో మొదటి సారిగా పాస్ బటన్‍ను హీరో మోటో కార్ప్ వారు ఈ మాయెస్ట్రో ఎడ్జ్‌లో కల్పించారు. దీనితో పాటు డిమ్ అండ్ డిప్ ఫీచర్ కూడా అందించారు.

లభించు రంగులు
హీరో మాయెస్ట్రోలో ఏడు రంగుల్లో లభించును
- క్యాండి బ్లేజింగ్ రెడ్
- ఫ్యాంథర్ బ్లాక్
- పియర్ల్ సిల్వర్ వైట్
- షూటింగ్ నైట్ స్టార్
- టెక్నో బ్లూ
- మట్టి వెర్నియర్ గ్రే
- మట్టి బ్లూ

ధర
- మాయెస్ట్రో ఎడ్జ్ యల్‌ఎక్స్ మోడల్ ధర రూ. 49,500
- మాయెస్ట్రో ఎడ్జ్ వియక్స్ మోడల్ ధర రూ. 50,700
- ఇంజన్: 110.9సీసీ, 4-స్ట్రోక్
- కూలింగ్: ఎయిర్ కూలింగ్
- అత్యధిక పవర్: 8.31బిహెచ్‌పి @ 8000 ఆర్‌పియమ్
- అత్యధిక టార్క్: 8.30 ఎమ్ఎమ్ @ 6500 ఆర్‌పియమ్
- స్టార్టింగ్: సెల్ఫ్-స్టార్ట్
- పొడవు: 1841 ఎమ్ఎమ్
- వెడల్పు: 695 ఎమ్ఎమ్
- ఎత్తు: 1190ఎమ్ఎమ్
- మొత్తం బరువు: 110 కిలోలు
- కొత్త డిజైన్
- స్కూటర్ సెగ్మెంట్లో మొదటి సారిగా కొత్త ఫీచర్లు
- దేశీయంగా తయారవడం
- ఇంటిగ్రేటెడ్ బ్రేక్ సిస్టమ్
- అందంగా ఉన్న ఎగ్జాస్ట్ సిస్టమ్
- ఏడు విభిన్నమైన రంగుల్లో లభించడం
- బూట్ మరియు ఫ్యూయల్ లెడ్ లను రిమోట్ ద్వారా ఓపెన్ చేయడం
- ప్రారంభంలో స్కూటర్ పికప్
- ఇందులో ఉపయోగించిన ప్లాస్టిక్ పరికరాల నాణ్యత
- రష్యా నుండి 39,000 కోట్లు విలువైన మిస్సైల్స్‌ను కొనుగోలు చేయనున్న భారత్
- కవాసకి వెర్సేస్ 650 అడ్వెంచర్ మోటార్ సైకిల్ : త్వరలో మార్కెట్లోకి విడుదల..
రెండు ధరలు ఎక్స్-షోరూమ్, (ఢిల్లీ)

స్పెసిఫికేన్స్ మొత్తంగా వీక్షించండి

క్లచ్: ఆటోమేటిక్ క్లచ్
గేర్ బాక్స్: వారియోమాటిక్ డ్రైవ్
టైర్ సైజు: ముందు వైపు 90/90-12-54
టైరు సైజు: వెనుకవైపు 90/100-10-53

కొలతలు
మాయెస్ట్రో ఎడ్జ్ కొలతలు:

నచ్చేవి

నచ్చనివి

హీరో మాయెస్ట్రో రేటింగ్స్

హీరో మాయెస్ట్రో ఇంజన్ వివరాలు

తీర్పు
హీరో మోయెస్ట్రో ఎడ్జ్ స్కూటర్ ఫీచర్ల పరంగా హోండా ఆక్టివాకు గట్టి పోటిగా నిలవగలదు. ఉత్తమమైన కలర్స్‌లో లభించడం ఇది ఎంతో మందిని ఆకర్షిస్తుంది.అయితే ఇందులో ఇంజన్ మరికొంత అభివృద్ది చేసుంటే బాగుండేది. అయితే ఇంటిగ్రేటెడ్ బ్రేక్స్ మీకు చక్కటి భద్రతను ఇస్తాయి. నూతనంగా డిజైన్ చేయబడిన ఈ మాయెస్ట్రో ఎడ్జ్ స్కూటర్ ప్రియుల మనస్సును దోచుకుంటుందని మా అభిప్రాయం.



Click it and Unblock the Notifications








