ఫేస్‌లిఫ్ట్ జాగ్వార్ ఎక్స్ఎఫ్‌ను విడుదల చేసిన జేఎల్ఆర్

కాగా.. ఈ నెలలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ నుండి వస్తున్న రెండో ఉత్పత్తి అప్‌గ్రేడెడ్ మిడ్-సైజ్ లగ్జరీ సెలూన్ "2012 జాగ్వార్ ఎక్స్ఎఫ్". ఈ మోడల్‌ను కంపెనీ తాజాగా దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సరికొత్త సెడాన్ కోసం జేఎల్ఆర్ ఇప్పటికే బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. 2012 జాగ్వార్ ఎక్స్ఎఫ్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న జాగ్వార్ ఎక్స్ఎఫ్ కన్నా మెరుగ్గా ఉండేలా జేఎల్ఆర్ తీర్చిదిద్దింది.
ఫేస్‌లిఫ్ట్ 2012 జాగ్వార్ ఎక్స్ఎఫ్ సెడాన్ 2.2 లీటర్, ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్‌తో లభ్యం కానుంది. మూడు వేరియంట్లలో లభ్యమయ్యే 2012 జాగ్వార్ ఎక్స్ఎఫ్ ప్రతి లీటర్ డీజిల్‌కు 18.75 కి.మీ. మైలేజ్‌ను ఇనివ్వనుంది. కాగా.. దేశీయ విపణిలో విడుదలైన రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీ ధర రూ.44.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది. ఇది పెట్రోల్ మరియు, డీజిల్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








