భారత్‌లో రేంజ్ రోవర్ ఎవోక్ విడుదల చేసిన జేఎల్ఆర్

రేంజ్ రోవర్ ఎవోక్ మూడు డీజిల్ వేరియంట్లు, ఒక పెట్రోల్ వేరియంట్లో లభ్యమవుతుంది. డీజిల్ వేరియంట్లో లభించే అన్ని మోడళ్లు కూడా 5-డోర్ ఆప్షన్‌ను కలిగి ఉంటాయి. అలాగే, పెట్రోల్ వేరియంట్లో లభించే రేంజ్ రోవర్ ఎవోక్ మోడళ్లు 3-డోర్ ఆప్షన్‌ను కలిగి ఉంటాయి. దేశీయ విపణిలో రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీ ధర రూ.44.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది.
పెట్రోల్ వేరియంట్ 3-డోర్ రేంజ్ రోవర్ ఎవోక్ ధర రూ.59 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది. ఇది ప్యూర్, ప్రెస్టీజ్ మరియు డైనమిక్ అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. డైనమిక్ వేరియంట్లో డైనమిక్ రేసింగ్ సీట్స్, నాలుగు రంగుల కలయికతో ఉండే ఇంటీరియర్స్ ఉంటాయి. ప్రెస్టీజ్ వేరియంట్ ఐదు రంగుల కలయికతో కూడిన ఇంటీరియర్స్ మరియు ప్యూర్ వేరియంట్ మూడు రంగుల కలయికతో ఉండే ఇంటీరియర్స్‌తో లభిస్తుంది.
డీజిల్ వేరియంట్ రేంజ్ రోవర్ ఎవోక్ 2.2 లీటర్ ఇంజన్‌ను కలిగి ఉండి 190 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. అలాగే, పెట్రోల్ వేరియంట్ 2.0 లీటర్ టర్బోచార్జ్‌డ్ ఇంజన్‌తో 237 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు వేరియంట్లు కూడా 6-స్పీడ్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభ్యమవుతాయి. ప్రస్తుతం జాగ్వార్ ల్యాండ్ రోవర్ దేశవ్యాప్తంగా 10 షోరూమ్‌లు ఉన్నాయి. త్వరలో కొత్త మరో మూడు యూనిట్లను ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications








