టొయోటా ఫన్-వీ కారు: నాలుగు చక్రాలపై స్మార్ట్ ఫోన్

Toyota Fun Vii
ఈ కారు ప్రొజెక్టర్ మాదిరిగా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ కారు లోపలి ఆకర్షనీయమైన డిజైన్ ఓ అద్భుతాన్ని తలపిస్తుంది. ఇల్యూషన్ టెక్నాలజీతో కూడిన ఈ కారులో కూర్చుని ఎలాంటి పరికరాలు (స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటివి) లేకుండానే ఇంటర్నెట్ ద్వారా స్నేహితులతో కనెక్ట్ కావచ్చు.

కారులో లోపలి భాగాలు కూడా తెరల మాదిరిగా పనిచేస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే, రోబో, ఐరన్ మ్యాన్ వంటి సినిమాల్లో చూపించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ కారు మరపిస్తుంది. ఈ నెలాఖరున జపాన్ దేశంలో జరగనున్న టోక్యో మోటార్ షోలో టొయోటా ఈ కాన్సెప్ట్ కారును ప్రదర్శించనుంది.

అయితే, ఖచ్ఛితంగా ఈ కాన్సెప్ట్ కారు మాత్రం ఉత్పత్తి దశకు వెళ్లే అవకాశాలు ఏ కోశాన కనబడటం లేదు. టెక్నాలజీలో తాము ఎంత ముందున్నామో నిరూపించుకునేందుకే ఈ కారును డిజైన్ చేశామని, ఇది "నాలుగు చక్రాలపై నడిచే స్మార్ట్ ఫోన్" (స్మార్ట్ ఫోన్ ఆన్ ఫోర్ వీల్స్) లాంటిదని టొయోటా పేర్కొంది.

ఇదొక త్రీ-సీటర్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు. పట్టణ ప్రాంతాల్లో చిన్న ప్రయాణ అవసరాల కోసం దీన్ని రూపొందించారు. దీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 105 కిలోమీటర్ల రేంజ్ వరకూ ప్రయాణించవచ్చని అంచనా. దీనికి సంబంధించిన సాంకేతిక వివరాలను టోక్యో మోటార్ షోలో కంపెనీ వెల్లడించనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 29, 2011, 13:20 [IST]
English summary
Japanese auto major Toyota Motor Co has unveiled its futuristic concept car "Fun-Vii". This concept car will be showcased at Tokyo Motor Show this week. Toyota says its a smart phone on four wheels. The Fun-Vii is three-seater electric car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+