ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ కారు ఫన్-వీని ఆవిష్కరించిన టొయోటా

అక్కడికే వస్తున్నా..! ఇది జపాన్ ఆటో దిగ్గజం టొయోటా రూపొందించిన ఫన్-వీ (Fun Vii) కాన్సెప్ట్ కారు. వెహికల్, ఇంటారాక్టివ్, ఇంటర్నెట్ అనే అర్థం వచ్చేలా దీని పేరును ప్రతిపాదించారు. ఈ కారుకు చుట్టు పక్కల అమర్చిన డోర్లు ఎల్‌సిడి టచ్ స్కీన్స్ మాదిరిగా పనిచేస్తాయి.
ఈ మొత్తం డోర్ కూడా, ఓ చట్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ పనిచేసినట్లుగానే పనిచేస్తుంది. ఒకరంగా చెప్పాలంటే ఇది కారు ఆకారంలో ఉండే పర్సనల్ కంప్యూటర్ అనొచ్చు. చిత్ర విచిత్రమైన వాల్‌పేపర్లను ఉపయోగించి ఊసరవెల్లిలా కార్ కలర్‌ను మార్చేసుకోవచ్చు. ఎన్నోరకాల మొబైల్ అప్లికేషన్లు ఇందులో యాక్సెస్ చేసుకోవచ్చు.
టొయోటా ఫన్-వీ కాన్సెప్ట్ కారుకు సంబంధించిన మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








