ఫోక్స్‌వ్యాగన్ నుంచి వెంటో, పోలోలలో స్పెషల్ ఎడిషన్‌లు

వెంటో బ్రీజ్ (Vento Breeze), పోలో బ్రీజ్ (Polo Breeze) అనే రెండు కొత్త స్పెషల్ ఎడిషన్ వేరియంట్లను పరిమిత కాలపు ఆఫర్‌తో మార్కెట్లోకి విడుదల చేసింది. రేపటి నుండి అంటే సెప్టెంబర్ 10, 2011వ తేదీ నుండి ఈ రెండు వేరియంట్లు లభ్యం కానున్నాయి. అది కూడా మిలిటెడ్ పీరియడ్ మాత్రమే.
ఈ రెండు వేరియంట్లలో కూడా రూ.40,000 విలువల కలిగిన అదనపు ఫీచర్లు ప్రస్తుత ధరకే లభ్యంకానున్నాయి. ప్రస్తుతం ఈ రెండు వేరియంట్లు కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతున్నాయి. కొత్తగా వస్తున్న వెంటో బ్రీజ్, పోలో బ్రీజ్‌ల కారు వెనుక బ్రీజ్ బ్రాండ్ ఉండనుంది.
గతంలో ఐపిఎల్ సీజన్ సమయంలో కూడా ఫోక్స్‌వ్యాగన్ తన సెడాన్ వెంటోలో ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసింది. కాగా.. తాజాగా విడుదల చేసిన బ్రీజ్ స్పెషల్ ఎడిషన్ వేరియంట్లలో లభించే అదనపు ఫీచర్లకు సంబంధించి మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications