ఇదీ సంగతి..: చిన్న కార్లు, చౌక కార్లు, భారీ డిస్కౌంట్లు..!

ఈ నేపథ్యంలో దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ పాత స్విఫ్ట్ కన్నా కేవలం రూ. 13,000 అధిక ధరకే సరికొత్త అధునాతన స్విఫ్ట్ 2011 (ధర రూ. 4.22 లక్షలు)ను అందిస్తోంది. మరో కార్ల తయారీ దిగ్గజం హోండా మోటార్స్ అందిస్తోన్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'హోండా జాజ్' ధరను 1.62 వరకూ తగ్గించి, ఈ మోడల్‌లో కొత్త వేరియంట్ జాజ్‌ను (ధర రూ. 5.5 లక్షలకే) అందిస్తోంది.
ఇక టొయోటా విషయానికి వస్తే.. భారత కార్ మార్కెట్లో చిన్న కార్లకు పెరుగుతున్న ఆదరణ, ఆసక్తిని గుర్తించి, కంపెనీ అందిస్తున్న పాపులర్ మోడల్ ఎతియోస్ సెడాన్ ఫ్లాట్‌ఫామ్‌పై భారత్‌లో తొలిసారి ఓ చిన్న కారు "ఎతియోస్ లివా" రూ. 3.99 లక్షలకే ఆఫర్ చేస్తోంది. దీంతో భారత కార్ మార్కెట్లో లభిస్తున్న చౌవకైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో ఎతియోస్ లివా కూడా ఒకటిగా నిలిచింది.


Click it and Unblock the Notifications








