ఇదీ సంగతి..: చిన్న కార్లు, చౌక కార్లు, భారీ డిస్కౌంట్లు..!

ఈ ధరల యుద్ధం కేవలం చిన్న కార్ విభాగానికి మాత్రమే పరిమితం కాలేదు. మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లోనూ ఈ ధోరణి కనిపిస్తుంది. హోండా సియోల్ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ సెడాన్ సిటీపై కంపెనీ ఏకంగా రూ. 66,000 డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ విభాగంలో హోండాకు డీజిల్ సెడాన్ లేకపోవడం మరియు మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో పోటీదారుల నుండి కొత్తగా వస్తున్న సెడాన్ కార్లు డీజిల్/పెట్రోల్ ఆప్షన్లతో లభిస్తుండటంతో పోటీని తట్టుకునేందుకు, కంపెనీకు ఇష్టం లేకపోయినా సిటీ సెడాన్‌పై ఈ భారీ డిస్కౌంట్‌ను ప్రకటించాల్సి వచ్చింది.
ఏదేమైనప్పటికీ.. ముందున్న పండుగ సీజన్‌పై కార్ల కంపెనీలు భారీ ఆశలు పెట్టుకున్నాయనే చెప్పాలి. ఈ సీజన్‌లో వాహనాల అమ్మకాలు జోరందుకోవచ్చునని దాదాపు అన్ని కార్ల తయారీదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరియు ఈ అవకాశాన్ని చేజిక్కుంచుకునేందుకు వాహనాల ధరలను తగ్గించుకుంటూ ధరల యుద్ధానికి తెరలేపుతున్నాయి.


Click it and Unblock the Notifications








