సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లోనూ డీజిల్ కార్లదే హవా

డీజిల్ మరియు పెట్రోల్ ధరల మధ్య వ్యత్యాసం సుమారు 50 శాతం ఉండటంతో కొత్తకార్లను కొనుగోలు చేసే వారే కాకుండా సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే వారు కూడా డీజిల్‌తో నడిచే కార్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వాస్తవానికి మెయింటినెన్స్ కాస్ట్ పరంగా చూస్తే.. డీజిల్ వేరియంట్ కార్ల కన్నా పెట్రోల్ వేరియంట్ కార్లే ఎంతో బెస్ట్ అన్ని చెప్పవచ్చు.
అయితే, ఇక్కడ పెరుగుతున్న పెట్రోల్ ధరలను దృష్టిలో ఉంచుకొని కాస్తంత భారమైనా ఫర్వాలేదని కొనుగోలుదారులు డీజిల్ వేరియంట్లనే ఆశ్రయించడం జరుగుతుంది. సాధారణంగా పెట్రోల్ వేరియంట్ కారు ధర కన్నా డీజిల్ వేరియంట్ కారు ధర సుమారు లక్ష రూపాయాలు అధికంగా ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం ఇంజన్ మరియు అందులో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం.


Click it and Unblock the Notifications








