సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లోనూ డీజిల్ కార్లదే హవా

Diesel Car or Petrol Car
ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ కూడా ఇంచుమించు కొత్త కార్ల మార్కెట్‌ను ప్రతిభింభిస్తోంది. గడచిన కొద్ది నెలలుగా గమనిస్తే.. భారత్‌లో ప్రీ-ఓన్డ్ (సెకండ్ హ్యాండ్) కార్ మార్కెట్ వ్యాపారం జోరందుకుంది. ఈ మార్కెట్ జోరుకు అనుగుణంగా పలు దేశీయ, విదేశీయ కంపెనీలు భారత ఆటో మార్కెట్లో ప్రీ-ఓన్డ్ కార్ బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నాయి.

ప్యాసింజర్ కార్ల తయారీదారుల నుంచి లగ్జరీ కార్ల తయారీదారుల వరకూ ఈ వ్యాపారంలోకి ప్రవేశించి ప్రోత్సాహకర వృద్ధిని కనబరుస్తాయి. అయితే, ఈ విభాగంలో కూడా ఇప్పుడు డీజిల్ కార్ ట్రెండ్ అధికంగా దర్శనిమిస్తోంది. సెకండ్ హ్యాండ్ కార్లలో కూడా ఎక్కువ మంది డీజిల్ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఫలితంగా, గడచిన కొద్ది నెలల్లోనే సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో డీజిల్ కార్ల ధరలు సుమారు 15-20 శాతం పెరిగాయి. పెరిగిన పెట్రోల్ ధరల నేపథ్యంలో డీజిల్ కార్లను వినియోగిస్తున్న యజమానులు తమ కార్లను విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో డీజిల్ కార్లకు డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేదు.

ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో, ఒకే వ్యక్తి చేతుల మీదుగా నడపడి, కారును జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉండి మరియు మంచి నాణ్యత కలిగి ఉండే డీజిల్ కార్లను పొందంటం అంత సులువైన అంశం కాదు. ఒకవేళ అలాంటి కార్లను సెకండ్ హ్యాండ్ కార్ డీలర్లు కొనుగోలు చేయాలని తలచినా సదరు వాహన యజమాని కారు ధరను హెచ్చించి చెప్పడం జరుగుతుంది.

సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో డీజిల్ కార్ల ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం. ఏదేమైనప్పటికీ, మొత్తం మీద గమనిసిస్తే.. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్‌తో నడిచే కార్ల కన్నా డీజిల్‌తో నడిచే కార్లదే పైచేయిగా ఉంది. కానీ, డీజిల్ ధరలు ఇదే స్థాయిలో కొనసాగుతాయని చెప్పడం మాత్రం అసాధ్యం. సబ్సిడి ధరకే డీజిల్‌ను విక్రయిస్తున్న కంపెనీలు నష్టాల భారిన పడుతుంటడంతో డీజిల్ ధర పెంపుపై ప్రభుత్వం ఓ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 30, 2011, 12:39 [IST]
English summary

 The recent fuel price hikes have again brought to the fore the argument of choosing between a petrol car and a diesel car. While both type of cars offer their own distinct advantages an individual needs to understand one's requirements and then make a choice. While a petrol car is cheaper to buy, it runs on a pricier fuel. A diesel car on the other hand is pricier to buy and runs on a cheaper fuel.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+