ఎతియోస్ మరియు ఎతియోస్ లివా డీజిల్ ప్రత్యేకతలు

Etios Liva Hatchback
పెట్రోల్ వేరియంట్ల మాదిరిగానే ఈ రెండు మోడళ్లు కూడా వివిధ రంగుల్లో లభిస్తుంది. ఎతియోస్ మరియు లివా డీజిల్ వెర్షన్లు సిఫనీ సిల్వర్, సెరెన్ బ్లూయిష్ సిల్వర్, సెలెస్టియల్ బ్లాక్, హార్మనీ బీగీ, వెర్మిలియన్ రెడ్, వైట్ మరియు ఆల్ట్రామెరైన్ బ్లూ (ఎతియోస్ లివా మాత్రమే) రంగుల్లో లభిస్తాయి.

ఎక్స్టీరియర్:
బోల్డ్ సింప్లిసిటీ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ రెండు వేరియంట్లను డిజైన్ చేశారు. స్మైల్ లైన్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్, ఉత్తమ ఏరోడైనమిక్స్ మరియు క్లియర్ అప్పీరెన్స్ కోసం వీటి పైభాగాన్ని (రూఫ్) విశిష్టంగా డిజైన్ చేశారు. ఎతియోస్ మరియు ఎతియోస్ లివాల పేర్లు స్పష్టంగా కనిపించేందుకు కారు ముందు మరియు వెనుక డైనమిక్ క్యారెక్టర్-లైన్‌ను ఉపయోంచారు.

ఇంటీరియర్:
రెండు రంగుల కలయికతో రూపొందించిన ఇంటీరియర్లను సౌకర్యవంతంగా మరియు స్పోర్టీగా తీర్చిదిద్దారు. క్యాబిన్ స్పేస్ విషయంలో ఈ రెండు వేరియంట్లు ది బెస్ట్ అనిపించుకోనున్నాయి. ఎతియోస్ సెడాన్ యొక్క బూట్ స్పేస్ (కారు వెనుక లగేజ్ పెట్టుకునేందుకు ఉపయోగించే స్థలం) 595 లీటర్లు మరియు ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ యొక్క బూట్ స్పేస్ 251 లీటర్లు.

ఒక లీటర్ వాటర్ బాటిళ్లను స్టోర్ చేసుకునేందుకు ఏడు బాటిల్ హోల్డర్స్, 13 లీటర్ కూల్డ్ గ్లవ్ బాక్స్, మొబైల్ హోల్డర్ వంటి ఎన్నో ఫీచర్లు ఈ రెండు కార్ల సొంతం. కారులోపలి సీటింగ్ ప్రయాణికుల మరింత సౌకర్యాన్ని ఇచ్చే విధంగా రూపొందించారు.

సేఫ్టీ:
ఎతియోస్ మరియు లివా డీజిల్ కార్లు ఎనర్జీ అబ్జార్వింగ్ బాడీ షెల్, డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్‌ బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి) మరియు సీట్‌బెల్ట్స్ వంటి భద్రతా ఫీచర్లను కలిగి ఉంటాయి.

ఇన్ని విశిష్ట ఫీచర్ల లభిస్తున్న ఈ రెండు వేరియంట్ల బుకింగ్‌లు మరియు డెలివరీలు నేటి నుండి అధికారికంగా ప్రారంభం కానున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, September 9, 2011, 15:03 [IST]
English summary
Designed around the concept of ‘Bold Simplicity’. A distinctive front grille with a smile line, sculpted surface and dynamic character-line in the front and rear, enhance the presence of the Etios and Etios Liva. The roof has a unique design for better aerodynamics and clean appearance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+