డీజిల్ వెర్షన్ ఎతియోస్, లివాలను విడుదల చేసిన టొయోటా

మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించినట్లుగానే ఆటో దిగ్గజం టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టికెఎమ్) నేడు ఎతియోస్ సెడాన్ డీజిల్ మరియు ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ డీజిల్ వేరియంట్లను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ డీజిల్ వేరియంట్‌లో ఉపయోగించిన 1.4 లీటర్ డి-4డి కామన్ రైల్ డీజిల్ ఇంజన్ 3800 ఆర్‌పిఎమ్ వద్ద 68 పిఎస్‌ల శక్తిని మరియు 1800-2400 ఆర్‌పిఎమ్ వద్ద 170 ఎన్ఎమ్‌ల అధిక టార్క్‌ను విడుదల చేస్తుంది.

డి-4డి టెక్నాలజీ టొయోటా అందిస్తున్న అత్యంత అడ్వాన్స్‌డ్ డీజిల్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీను ఇన్నోవా, కరోలా ఆల్టిస్, ఫార్చ్యూనర్, ప్రాడో మరియు ఎల్‌సి 200 మోడళ్లలో టొయోటా ఉపయోగిస్తుంది. ఈ టెక్నాలజీ ప్రపంచ వ్యాప్తంగా అధిక నాణ్యతకు, మన్నికకు మరియు విశ్వసనీయతకు మంచి పేరును తెచ్చుకుంది. ఈ టెక్నాలజీ అత్యుత్తమ డ్రైవింగ్ పెర్ఫామెన్స్‌తో పాటుగా మెరుగైన మైలేజీని కూడా ఆఫర్ చేస్తుంది.

అధిక పెర్ఫామెన్స్ కలిగిన ఈ ఇంజన్ ఫ్లాట్ టార్క్‌ను విడుదల చేస్తూ తక్కువ గేర్ షిఫ్టింగ్‌కు కారణమవుతుంది, ఫలితంగా మంచి మైలేజ్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఇంజన్ లీటరుకు 23.59 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని టొయోటా వెల్లడించింది.

నాలుగు డీజిల్ వేరియంట్లలో లభించే ఎతియోస్ సెడాన్ ధరలు రూ.6.44 లక్షల నుండి రూ.7.87 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకూ ఉన్నాయి. ఇది జిడి, జిడి (ఎస్‌పి), విడి మరియు విఎక్స్‌డి అనే నాలుగు వేరియంట్లలో లభ్యమవుతుంది.

కాగా.. రెండు వేరియంట్లలో లభించే ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ. 5.54 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. ఇది జిడి, జిడి (ఎస్‌పి) అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, September 9, 2011, 15:06 [IST]
English summary
Toyota Kirloskar Motor (TKM) today launched of the diesel variants of Etios and Etios Liva. The vehicles are powered with a refined 1.4 litre D-4D Common Rail Diesel Engine that generates maximum power of 68 PS 3800 rpm and highest torque of 170 NM 1800 – 2400 rpm. Toyota’s D-4D technology, the most advanced diesel technology offered by Toyota, used in Innova, Corolla Altis, Fortuner, Prado and LC 200 has earned a reputation the world-over for its high quality, durability and reliability.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+