అమితాబ్ చేతుల మీదుగా... ఫోర్స్ వన్ ఎస్‌యూవీ విడుదల

Amitabh Force One
గతంలో వన్ఇండియా ఆటోమొబైల్ రిపోర్ట్ చేసినట్లుగానే.. ప్రముఖ వాణిజ్య వానాల తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ తమ తొలి ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) 'ఫోర్స్ వన్'ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఫోర్స్ వన్ ఎస్‌యూవీని కంపెనీ విడుదల చేసింది.

2148 సీసీ ఇన్‌లైన్-ఫోర్ డీజిల్ ఇంజన్ కలిగిన ఫోర్స్ వన్ ఎస్‌యూవీ 138 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని మరియు 32 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఉపయోగించిన 2.2 ఎఫ్ఎమ్‌టెక్ ఇంజన్ మెర్సిడెస్ బెంజ్‌ నుంచి పొందినది. ఇది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఏడుగురు ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించే వీలున్న ఈ ఎస్‌యూవీలో అధిక స్థలం ఉండి దూర ప్రయాణాల్లో కూడా ఎంతో సౌకర్యాన్ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ ఎస్‌యూవీలో అమర్చబడిన ఎల్ఈడి హెడ్‌లైట్లు మరో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ప్రస్తుతం ఇది టూ-వీల్ (4x2) డ్రైవ్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తోంది. వచ్చే ఏడాదిలో ఇందులో ఫోర్-వీల్ (4x4) డ్రైవ్ ఆప్షన్ కలిగిన వేరియంట్‌ను కూడా ఫోర్స్ మోటార్స్ విడుదల చేయనుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఫోర్స్ వన్ ఎస్‌యూవీ లీటరుకు 11.6 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

భారత మార్కెట్లో ఫోర్స్ వన్ ఎస్‌యూవీ ధరలను రూ. 10.65 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ), రూ. 11.1 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై)గా ఫోర్స్ మోటార్స్ నిర్ణయించింది. ఫోర్స్ వన్‌ ఎస్‌యూవీలో ఉండే మరిన్ని అదనపు ఫీచర్ల గురించి తెలుసుకోవడానికి నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Friday, August 19, 2011, 16:16 [IST]
English summary
Force Motors have launched the Force One SUV, its first such product as it plans to enhance its presence in the passenger car business. With a brand ambassador like Amitabh Bachchan, Force Motors' Personal Vehicles Division will make its foray with 22 dealerships to begin with as the vehicle hits showrooms from 1st September.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+