హోండా చిన్న కారుకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండండి!

Honda Jazz
స్మాల్ కార్ లవర్స్‌ను ఎంతగానో ఊరిస్తున్న చవకైన హోండా హ్యాచ్‌‌బ్యాక్ కారు 'బ్రయో' విడుదలకు దాదాపు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. పరిశ్రమలోని కొన్నిహిత వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం, ఈ పండుగ సీజన్‌లోనే హోండా బ్రయో విడుదలయ్యే అకాశం ఉంది. ప్రస్తుతం హోండా అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు 'హోండా జాజ్'లో కొత్త వెర్షన్ కూడా ఇదే సీజన్‌లో విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పాత హోండా జాజ్ స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకే ఆ మోడల్‌పై రూ. 1.75 లక్షల డిస్కౌంట్‌ను హోండా సియోల్ కార్స్ ఇండియా ప్రకటించినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఈ ఏడాది మార్చి-మే నెలల్లోనే హోండా బ్రయో కారును భారత మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ భావించింది. అయితే.. జపాన్‌లో సంభవించిన ప్రకృతి భీభత్సం బ్రయో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆ సమయంలో ఏర్పడిన విడిభాగాల కొరత కారణంగా బ్రయో విడుదల ఆలస్యం అయింది. కానీ, చిన్న మార్కెట్ అయిన థాయ్‌లాండ్‌లో మాత్రం గడచిన మార్చిలోనే బ్రయో కారును హోండా విడుదల చేసింది. అక్కడి మార్కెట్లో బ్రయో కారుకు అశేష ఆదరణ లభించింది. అయితే, భారత్ వంటి పెద్ద మార్కెట్లో బ్రయో కారును ప్రవేశపెట్టాలంటే, ఆ మోడల్ ఉత్పత్తి పూర్తిగా అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 3, 2011, 13:56 [IST]
English summary
The much awaited small car 'Honda Brio' hatchback from Japanese carmaker Honda will expected to launch in September, industry sources said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+