సెడాన్ కొనుక్కోవాలా..? లేక ఎస్‌యూవీ కొనుక్కోవాలా..?

మిడ్-సైజ్ సెడాన్ కారును కొనుక్కోవాలంటే.. కనీసం 8-10 లక్షల రూపాయాలు వెచ్చించాలి, అలాగే ఓ మంచి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని కొనుక్కోవాలన్నా ఇంచు మించు అంతే వెచ్చించాల్సి ఉంటుంది. అయితే.. ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ మార్కెట్లో పెరుగుతున్న పోటీ కారణంగా.. వాహనాలు ధరలు దిగిరావడమో.. లేక చౌక రకం వేరియంట్లను ప్రవేశపెట్టడమో జరుగుతుండటాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం.
ఈ కోవలోనే.. హోండా సియోల్ కార్స్ ఇండియా అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్‌పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించి రూ. 7,49,000 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభ ధరకే సిటీ సెడాన్ (1.5 ఈ ఎమ్‌టి) కారును విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. ఎస్‌యూవీల తయారీలో పేరుగాంచిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న స్కార్పియో ఎస్‌యూవీలో రూ. 7,46,000 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరకే ఓ చౌక రకం వేరియంట్ స్కార్పియో ఈక్స్ (బిఎస్-3)ను అందిస్తోంది.
అంటే దీన్ని బట్టి చూస్తే.. ఓ సెడాన్ కారును కొనుగోలు చేసే ధరకే ఓ ఎస్‌యూవీను సొంతం చేసుకోవచ్చన్నమాట. నలుగురు/ఐదుగురు మాత్రమే ఉండే కుటుంబం మరియు ప్రీమియం లుక్ కోరుకునే ఎగ్జిక్యూటివ్‌లు సిటీ సెడాన్ కారును ఎంచుకోవచ్చు. వాస్తవానికి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సిటీ సెడాన్ కారు ఎంతో ఆకర్షనీయంగా లగ్జరీ కారు అనుభూతిని ఇస్తుంది. ప్రొఫెషనల్ లుక్, ఫీల్ కోరుకునే వారు, కాస్తంత హుందా కనిపించాలనుకునే వారు సిటీ సెడాన్ కారును కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








