హోండా సిటీ సెడాన్ కారుపై రూ.70,000 డిస్కౌంట్..!!

హోండా డీలర్లు అన్ని రకాల సిటీ సెడాన్ మోడళ్లపై రూ.60,000 నుంచి రూ.70,000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. గతంలో కొత్త హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసేందుకు గానూ పాత మోడల్ స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కూడా హోండా ఇదే విధంగా భారీ డిస్కౌంట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోండా సిటీ సెడాన్ బేస్ వేరియంట్ ధర రూ.7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది.
ఇటీవలి కాలంలో హోండా సిటీ సెడాన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో కంపెనీ ఈ మోడల్‌పై రూ.66,000 డిస్కౌంట్‌ను ప్రకటించింది. దీంతో సిటీ సెడాన్ బేస్ వేరియంట్ రూ.7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కి చేరింది. మరింకెందుకు ఆలస్యం సిటీ సెడాన్ స్టాక్ ముగియక మునుపే మీ సిటీ సొంతం చేసుకోండి. మరి హోండా కొత్తగా విడుదల చేయనున్న 2012 సిటీ సెడాన్ కారును హోండా జాజ్ మాదిరిగానే తక్కువ ధరకే విడుదల చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
సిటీ సెడాన్‌లో కొన్ని ప్రధాన ఫీచర్లు:
* యారో షాట్ ఫామ్ డిజైన్
* అల్లాయ్ వీల్స్
* క్రోమ్ డోర్ హ్యాండిల్స్
* ఫాగ్ ల్యాంప్స్
* ఎగ్జాస్ట్ పైప్ ఫినిషర్
* అడ్వాన్స్‌డ్ 118 పిఎస్ 1.5 లీ ఐ-విటెక్ ఇంజన్
* పెడల్ షిఫ్ట్‌తో కూడిన 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్
* ప్రిమీయం బీగీ ఇంటీరియర్స్
* రిమోట్‌తో కూడిన అడ్వాన్స్‌డ్ ఇంటిగ్రేటెడ్ ఆడియో (యూఎస్‌బి, ఆక్స్/ఎమ్‌పి3)
* స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్
* టిల్ట్ స్టీరింగ్
* కీలెస్ ఎంట్రీ
* అడ్జస్టబల్ డ్రైవర్ సీట్
* వెనుక అద్దంపై డి-ఫాగ్గర్
* డ్యూయెల్ ఫ్రంట్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్
* ఏబిఎస్, ఈబిడి, బ్రేక్ అసిస్ట్
* ఉ-కాన్ బాడీ
* ఈసియూ ఇమ్మొబిలైజర్ సిస్టమ్


Click it and Unblock the Notifications








