అక్టోబర్‌లో విడుదలైన కార్లు - మారుతి ఆల్టో ఎక్స్‌ప్లోర్

హ్యుందాయ్ ఇయాన్ రాకతో తన స్థానానికి ఎక్కడ ముప్పు వాటిళ్లుతుందోనని, ఇదే సెగ్మెంట్లో మారుతి సుజుకి అందిస్తున్న చిన్న కారు ఆల్టోలో ఓ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. డిజైన్, ఇంజన్ పెర్ఫామెన్స్‌లలో ఆల్టోలో ఎలాంటి మార్పులు చేయకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్-ఎండ్ వేరియంట్ ఆల్టోకే మరిన్ని అధనపు ఫీచర్లను జోడించి ఆల్టో ఎక్స్‌ప్లోర్ పేరుతో విడుదల చేసింది.

ఆల్టో టాప్-ఎండ్ వేరియంట్‌లైన ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ, ఆల్టో కె10 విఎక్స్ఐలో ఈ లిమిటెడ్ ఎడిషన్ అందుబాటులో ఉంటుంది. ఇది ఎక్రు బీగీ, సుపీరియర్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్, ఫైర్ బ్రిక్ రెడ్, బ్లూ బ్లేజ్ మరియు సిల్కీ సిల్వర్ అనే ఆరు ఆకర్షనీమైన రంగుల్లో లభ్యమవుతుంది. ఆల్టో ఎక్స్‌ప్లోర్ (ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ) ధర రూ.2.81 లక్షలు గానూ మారుతి ఆల్టో ఎక్స్‌ప్లోర్ (ఆల్టో కె10 విఎక్స్ఐ) రూ.3.71 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై) గాను ఉంది.

లిమిటెడ్ ఎడిషన్ ఆల్టో ఎక్స్‌ప్లోర్ మోడల్‌లో లెథర్ సీట్లు, యూఎస్‌బి, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డబుల్-డిన్ స్టీరియో సిస్టమ్, స్పోర్టీ రియర్ స్పాయిలర్, సరికొత్త బాడీ గ్రాఫిక్స్, కారు బాడీ రంగులోనే ఉండే బంపర్స్, బాడీ కలర్డ్ రియర్ వ్యూ సైడ్ మిర్రర్స్, బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్, స్టైలిష్ డోర్ స్టిల్ గార్డ్, మడ్ ఫ్లాప్ సెట్, యూనివర్సెల్ కార్పెట్ మ్యాట్ వంటి అధనపు ఫీచర్లను జోడించారు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 2, 2011, 17:35 [IST]
English summary
Maruti Suzuki introduced a limited editions of its highest selling brand Alto. Named as Alto Xplore, this limited edition is packed with new features. The limited edition is available in top variants of Alto Lxi, Alto-K10 Vxi. Alto Lxi priced at Rs. 2.81 lakh and Alto K10 Vxi priced at Rs. 3.17 lakh (ex-showroom, Mumbai).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+