మారుతి 800 స్థానాన్ని కైవసం చేసుకోనున్న 'ఇయాన్'

హ్యుందాయ్ ఇయాన్ వచ్చే నెలలో విడుదల కానుంది. కాలుష్య నిబంధనలకు లోబడి ప్రస్తుతం కొన్ని ప్రధాన నగరాల్లో మారుతి 800 కారుపై నిషేధం విధించిన నేపథ్యంలో ఆ స్థానాన్ని తమ వశం చేసుకునేందుకు హ్యుందాయ్ ఈ చిన్న కారుకు రూపకల్పన చేసింది. అటు ధరలోనూ, ఇటు ఫీచర్లలోనూ ఎక్కడా తీసిపోకుండా ఈ కారును డిజైన్ చేసింది.
ప్రస్తుతం ఈ కారు ప్రయోగదశలో ఉంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన రహస్య చిత్రాలు (స్పై పిక్చర్స్) అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, హ్యుందాయ్ ఇయాన్ ధర సుమారు రూ.2.5 లక్షల మేర ఉండే అవకాశం ఉంది. అంటే ఈ ధర ప్రకారం గమనిస్తే.. టాటా నానో టాప్ ఎండ్ వేరియంట్, మారుతి సుజుకి ఆల్టో, చెవర్లే స్పార్క్ వంటి కార్ల జోరుకు ఇది చెక్ పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications