మహీంద్రా స్కార్పియో ఈఎక్స్‌లో ఉండే ప్రధాన ఫీచర్లు

మహీంద్రా స్కార్పియో ఈఎక్స్‌లో కొన్ని విశిష్ట ఫీచర్లను గమనిస్తే....:
* ఇది బిఎస్-4 (భారత్ స్టేజ్ 4) వేరియంట్లో కూడా లభిస్తుంది (ధర రూ. 7,59,200 ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).
* ఇది కేవలం 11.2 సెకన్లలో 0-60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
* మహీంద్రా స్కార్పియో ఈఎక్స్ పవర్ స్టీరింగ్‌తో లభిస్తుంది.
* ఫైవ్-జోన్ కుషన్ సస్పెన్షన్‌తో ఇది దూర ప్రయాణాల్లో కూడా సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పస్తుంది.
* ఏఆర్ఏఐ (ARAI) సర్టిఫై ప్రకారం ఇది లీటరుకు 14 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.
* అధిక మైలేజ్ ఇచ్చేందుకు గానూ స్కార్పియో ఈఎక్స్ ఇంజన్‌ను తక్కువ పవర్ ఉండేలా తీర్చిదిద్దారు.
* ఈ కారు దొంగల బారిన పడకుండా ఉండేలా డిజిటల్ ఇమ్మొబిలైజర్ సిస్టమ్‌తో లభిస్తుంది.
* ప్రమాదాలను తట్టుకునే విధంగా కారు బాడీని (Crash Protection Crumple Zone) డిజైన్ చేశారు.
* కారు చలనంలో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు డోర్లు ఓపెన్ కాకుండే అండేలా రూపొందించిన చైల్డ్ లాక్స్.
* కారు ముందువైపు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు డ్రైవ్ గాయాల బారిన పడకుండా ఉండేలా రూపొందించిన స్టీరింగ్ (Collapsible steering).
* ఇది రాకీ బీగి, డైమండ్ వైట్, ఫెయిరీ బ్లాక్, మిస్ట్ సిల్వర్ అనే నాలుగు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది.
హైదరాబాద్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ సిటీ సెడాన్ మరియు ఎంట్రీ లెవల్ మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
హోండా సిటీ (1.5 E MT) - రూ. 7,63,000/-
మహీంద్రా స్కార్పియో (EX BS3) - రూ. 7,40,600/-
మహీంద్రా స్కార్పియో (EX BS4) - రూ. 7,53,700/-


Click it and Unblock the Notifications








