స్కార్పియో బుకింగ్స్‌ను తన్నుకుపోతున్న ఎక్స్‌యూవీ500!

ఇప్పటికే మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీను బుకింగ్ చేసుకున్న వారంతా తమ బుకింగ్‌లను రద్దు చేసుకొని కొత్తగా విడుదలైన మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీను బుక్ చేసుకుంటున్నారు. గడచిన శనివారం మా వన్ఇండియా ఆటోమొబైల్ ప్రతినిధి చేతన్ బెంగుళూరులోని ఓ స్థానిక డీలరు వద్దకు వెళ్లగా.. ఒక్క గంట వ్యవధిలో అప్పటికే బుకింగ్ అయి ఉన్న 60 స్కార్పియోలకు గానూ 40 మంది తమ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసుకొని కొత్త ఎస్‌యూవీని బుక్ చేసుకున్నట్లు తెలిపారు.
కొనుగోలుదారులు తమ మనసు మార్చుకోవడానికి ఒక్కటే కారణం. మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ ధర. మహీంద్రా ఎక్స్‌యూవీ500 ప్రారంభ వేరియంట్ (డబ్ల్యూ6) ధర కేవలం రూ. 10.80 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉండటంతో టాప్-ఎండ్ వేరియంట్ స్కార్పియోను కొనుగోలు చేయాలనుకున్న వారంతా కొత్తగా వచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో స్కార్పియో ఆర్డర్లను ఎక్స్‌యూవీ500 తన్నుకుపోతున్నట్లయింది.
మహీంద్రా స్కార్పియో ప్రారంభ వేరియంట్ (ఈఎక్స్, బిఎస్-3) ధర రూ.7,40,600 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) లుగా ఉండగా, టాప్-ఎండ్ వేరియంట్ (విఎల్ఎక్స్, ఎటి, బిఎస్-4) ధర రూ.12,39,500 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది. ధరలో ఈ రెండు మోడళ్లకు మధ్య పెద్ద వ్యత్యాసం లేకపోవడం, ఎక్స్‌యూవీ500 'వరల్డ్ క్లాస్ ఫీచర్ల'తో లభిస్తుండటంతో కొనుగోలుదారులు స్కార్పియోను వదలి ఎక్స్‌యూవీ500కు జిందాబాద్ కొడుతున్నారు.
ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే స్కార్పియో అమ్మకాలు భారీ పడిపోవడం లేదా డీలర్ల వద్ద స్కార్పియో ఇన్వెంటరీ భారీగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా.. కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ500 వెయిటింగ్ పీరియడ్ కూడా పెరిగే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో స్కార్పియో స్థానాన్ని అలానే నిలబెట్టుకోవాలంటే మహీంద్రా తన ఎక్స్‌యూవీ500 ధరను పెంచడమో లేక స్కార్పియో ధరను మరికాస్త తగ్గించడమో చేయాలి. ఎక్స్‌యూవీ500 విడుదల సందర్భంగా మరో మూడు నెలలో ఈ మోడల్ ధరలను సవరించే అంశాన్ని పరిశీలిస్తామని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








