జైలో సెలబ్రేషన్ ఎడిషన్: ఇది చాలా హాట్ గురూ..!!

ప్రత్యేకమైన కార్పోరేట్ అడ్వాంటేజ్, విలాస వంతమైన ఫీచర్లతో పెరల్ వైట్, వాల్‌నట్ బ్రౌన్ అనే రెండు అదనపు ఆకర్షనీయమైన రంగుల్లో ఈ ఎమ్‌యూవీ లభించనుంది. మహీంద్రా జైలో సెలబ్రేషన్ ఎడిషన్ ఎమ్‌యూవీలో ప్రత్యేకమైన డిజైనర్ బాడీ గ్రాఫిక్స్, సెలబ్రేషన్ ఎడిషన్‌ను గుర్తు చేస్తూ ఇంటీరియర్లపై ప్రత్యేకంగా ముద్రించిన కంపెనీ లోగో, జెన్యూన్ ఇటాలియన్ లెథర్ ఇంటీరియర్స్, లెథర్‌తో కవర్ చేయబడిన స్టీరింగ్ వీల్ అండ్ గేర్ నాబ్, డార్క్ చాకోలేట్ గ్లోజీ ఫినిషింగ్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మహీంద్రా జైలో సెలబ్రేషన్ ఎడిషన్ బిఎస్-3 వేరియంట్ ధర (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) రూ.8,95,200గా ఉండగా, మహీంద్రా జైలో సెలబ్రేషన్ ఎడిషన్ బిఎస్-4 వేరియంట్ ధర (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) రూ.9,06,500గా ఉంది.


Click it and Unblock the Notifications








