కొత్త స్విఫ్ట్ బుకింగ్‌లను నిలిపివేస్తున్న మారుతి డీలర్లు!

New Swift
మారుతి సుజుకి ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను బుక్ చేసుకున్న వినియోగదారులు ఇప్పుడు డైలమాలో పడుతున్నారు. భారత ఆటోమొబైల్ చరిత్రలో ఇదివరకెన్నడూ లేనివిధంగా విడుదలకు ముందే భారీ బుకింగ్‌లను కొత్త స్విఫ్ట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం, ఈ కొత్త స్విఫ్ట్ హర్యానాలోని మానేసర్ ప్లాంటులో ఉత్పత్తి అవుతుంది. అయితే, మానేసర్ ప్లాంటులో నెలకొన్న తాజా పరిణామాలు ఎంతకీ సద్దుమణగకపోతుండటంతో కొత్త స్విఫ్ట్ ఉత్పత్తి భారీగా క్షీణిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త స్విఫ్ట్‌ను బుక్ చేసుకున్న కొనుగోలుదారులు ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయామని లబోదిబో మంటున్నారు.

మరికొందరు డీలర్లపై వత్తిడి తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకూ మారుతి సుజుకి స్విఫ్ట్ డెలివరీలు, ఉత్పత్తి వంటి విషయాలపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అంతేకాకుండా.. మానేసర్ వర్కర్లు గుడ్ కండక్ట్ బాండ్‌పై సంతకం చేస్తేనే ప్లాంటులోనికి అనుమతిస్తామంటూ కఠిన చర్యలను అవలంభిస్తోంది. తాజాగా యాజమాన్యాకి కార్మికులకు మధ్య తలెత్తిన వివాదం నేటితో రెండో వారానికి చేరుకుంది.

శనివారం నాటికి మొత్తం ఏడు రోజులకు గానూ, మానేసర్ ప్లాంటులో కేవలం 500 కార్లు మాత్రమే తయారయ్యాయి. వాస్తవానికి కార్మికులందరూ పూర్తిస్థాయిలో పనిచేసి ఉంటే ఇదే సమయానికి 8,400 కార్లు ఉత్పత్తి అయ్యేవి. కాగా.. దేశవ్యాప్తంగా మారుతి సుజుకి డీలర్లు కొత్త స్విఫ్ట్ బుకింగ్‌లను నిలిపివేసినట్లు తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 6, 2011, 18:15 [IST]
English summary
Maruti Suzuki dealers across the country have stopped taking new bookings for 2011 Swift hatchback, due to production shortage at Manesar plant.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+