సుమారు 8 నెలలకు పైగా పెరిగిన స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్

New Swift
కొత్త స్విఫ్ట్ డెలివరీల కోసం కొనుగోలుదారులు డీలర్లపై వత్తిడి అధికం చేస్తుండటంతో ప్రస్తుతం ఉన్న బుకింగ్‌లు క్లియర్ అయిన తర్వాత మాత్రమే తాజా బుకింగ్‌లను ప్రారంభించాలని సదరు డీలర్లు యోచిస్తున్నారు. ఫలితంగా కొత్త స్విఫ్ట్ వెయింటింగ్ పీరియడ్ ఎనిమిది నెలలకు, కొన్ని ఎంపిక చేసిన వేరియంట్లపై అంతకు మించి పెరిగినట్లు సమాచారం.

కొత్త స్విఫ్ట్‌ను విడుదల చేయడం కోసం రెండు-మూడు నెలల ముందు నుంచే పాత స్విఫ్ట్ ఉత్పత్తిని నిలిపివేయడం మరియు ఈ మోడల్‌పై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొనడంతో కొత్త స్విఫ్ట్‌ భారీ సంఖ్యలో బుకింగ్‌లు వచ్చిపడ్డాయి. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, ఇప్పటి వరకూ కొత్త స్విఫ్ట్‌కు లక్ష యూనిట్ల వరకూ బుకింగ్‌లు వచ్చి ఉండొచ్చని అంచనా.

మారుతి ఉన్నతాధికారులు కూడా తమ డీలర్లకు తాజా బుకింగ్‌లు తీసుకోవద్దని చెబుతున్నారు. దీంతో ఎంత వేగంగా కొత్త స్విఫ్ట్ మార్కెట్లో సంచలనం సృష్టించిందో, అధిక వెయిటింగ్ పీరియడ్ కారణంగా అంతే వేగంగా తన పేరుతో పాటు కంపెనీ పేరును కూడా దెబ్బతీస్తోంది. దీంతో కొత్త స్విఫ్ట్ కొనాలనుకునే వారు వేరే కార్ బ్రాండ్‌లను ఎంచుకుంటున్నారు.

మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో కార్మిక సమస్య ఇలానే కొనసాగుతుంటే, కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ వేరియంట్‌పై జనాదరణ తగ్గడంతో పాటు కంపెనీ కొత్తగా విడుదల చేస్తానని చెప్పిన కాంపాక్ట్ స్విఫ్ట్ డిజైర్ సెడాన్ వేరియంట్ విడుదల కూడా మరింత ఆలస్యం అయ్యే ఆస్కారం ఉంది. మరి ఈ సమస్యకు మారుతి ఎలా ఫుల్‌స్టాప్ పెడుతుందో వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Tuesday, September 6, 2011, 18:19 [IST]
English summary
The labour issue at country's biggest carmaker Maruti Suzuki India's Manesar plant is still on. MSI said it will not resume full-scale production at its Manesar plant till workers sign a 'good conduct bond'. Slowdown in production will result in delivery periods of new Swift stretching up to eight months, and perhaps even more for select variants.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+