మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ వర్సెస్ ఫోర్డ్ ఫిగో - పార్ట్ 3

మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ వర్సెస్ ఫోర్డ్ ఫిగో - హ్యాండ్లింగ్ అండ్ పెర్ఫామెన్స్:
శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉన్నందువలన స్విఫ్ట్ హ్యాండ్లింగ్, పెర్ఫామెన్స్‌లు మెరుగ్గా ఉంటాయి. ఇందులో అమర్చిన ఇంజన్ స్మూత్‌గా రన్ అవుతూ స్పోర్టీ అనుభూతిని అందిస్తుంది. దీని వెడల్పాటి టైర్ల కారణంగా ఇది మంచి రోడ్ గ్రిప్‌ను కలిగి ఉంటుంది. ఎక్కువ శ్రమ లేకుండా ఇంజన్ ఆర్‌పిఎమ్ ఊపందుకుంటుంది. అలాగే, ఫోర్డ్ ఫిగో కూడా హ్యాండ్లింగ్ అండ్ పెర్ఫామెన్స్‌ల ఏ మాత్రం తీసిపోదు. కానీ ఈ విషయంలో ఫోర్డ్ ఫిగో కన్నా కొత్త స్విఫ్ట్‌ కారే ది బెస్ట్ అని చెప్పవచ్చు.

మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ వర్సెస్ ఫోర్డ్ ఫిగో - ధరలు:
ఇకపోతే ఈ రెండు కార్లలో చివరిగా పరిశీలించాల్సిన అంశం ధరలు. మారుతి సుజుకి స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.4.22 లక్షల నుండి రూ.5.53 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

ఫోర్డ్ ఫిగో ధరల విషయానికి వస్తే.. ఇవి రూ.3.69 లక్షల నుండి 4.67 లక్షల మధ్యలో ఉన్నాయి.

మరి ఏది బెస్ట్:
కేవలం ధర విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే... సందేహం లేకుండా ఫోర్డ్ ఫిగో ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఫోర్డ్ ఫిగో కేవలం తక్కువ ధరను కలిగి ఉండటమే కాకుండా, కొత్త స్విఫ్ట్‌ కన్నా అధిక ఫీచర్లను ఆఫర్ చేస్తుంది. తక్కువ ధరకే ఫోర్డ్ ఫిగోలో ఈబిడితో కూడిన ఏబిఎస్, ఆడియో సిస్టమ్, ఎయిర్‌బ్యాగ్స్, ఇంటిగ్రేటెడ్ బ్లూటూత్ వంటి ఫీచర్లను అందిస్తుంది.

అయితే, రియర్ పవర్ విండోస్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను మాత్రమే ఫోర్డ్ ఫిగోలో పొందలేము. కాగా.. సర్వీస్ సెంటర్స్, స్పేర్ పార్ట్స్ లభ్యత, బ్రాండ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే నిస్సందేహంగా మారుతి సుజుకి స్విఫ్ట్ అన్ని విధాలా బెస్ట్ కారు అని చెప్పవచ్చు. అయితే, స్విఫ్ట్ ప్రియులను ఇప్పుడు వేదిస్తున్న సమస్య ఒక్కటే.. అధిక వెయిటింగ్ పీరియడ్. అయినప్పటికీ, కొనుగోలుదారులు మారుతి స్విఫ్ట్‌‌నే కోరుకుంటే.. డెలివరీ కోసం 6-9 నెల కాలం వేచియుండకతప్పదు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 25, 2011, 16:13 [IST]
English summary
Ford Figo vs 2011 Maruti Suzuki Swift; confused to buy which one. Here is a comparison that helps you to take decision.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+