మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ వర్సెస్ ఫోర్డ్ ఫిగో - పార్ట్ 2

మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ వర్సెస్ ఫోర్డ్ ఫిగో - ఇంటీరియర్స్:
స్విఫ్ట్‌లో ఇంటీరియర్స్‌కు ప్రీమియం లుక్ ఇచ్చేందుకు మారుతి సుజుకి కాస్తంత శ్రమించదనే చెప్పాలి. స్విఫ్ట్ ఇంటీరియర్స్‌లో నాణ్యమైన ప్లాస్టిక్‌ను ఉపయోగించారు. ఇంటీరియ్ స్థలాన్ని కూడా పెంచడం జరిగింది. కొత్త స్విఫ్ట్‌లో డిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్‌లు పాత స్విఫ్ట్ కన్నా మెరుగ్గా, చూడగానే ఆకట్టుకునేలా డిజైన్ చేయబడ్డాయి.
అదే ఫోర్డ్ ఫిగో విషయానికి వస్తే.. కారులోపలి ప్రవేశించగానే స్విఫ్ట్ కన్నా ఇది తాజా అనుభూతిని అందిస్తుంది. ఆకట్టుకునే డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్‌లు ఫోర్డ్ ఫిగోకు ఓ కొత్త రూపాన్ని ఇస్తాయి. అయితే, వెనుక సీట్ విషయానికి వస్తే.. లెగ్‌రూమ్ స్పేస్ తక్కువగా ఉండి ముగ్గురు ప్రయాణికులు కూర్చోవడానికి అసౌకర్యంగా ఉంటుంది.
మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ వర్సెస్ ఫోర్డ్ ఫిగో - ఇంజన్ (పెట్రోల్ వేరియంట్స్ మాత్రమే):
మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్‌లో అభివృద్ధి చేసిన డ్యూయెల్ వివిఐటి టెక్నాలజీ కలిగిన కె12 1.2 లీటర్ ఎమ్‌పిఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. నాలుగు సిలిండర్లు కలిగిన 1197 సీసీ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 86 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 114 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభించే కొత్త స్విఫ్ట్ ప్రతి లీటరు పెట్రోల్‌కు 18.6 కి.మీ. మైలేజీనిస్తుంది.
అదే.. ఫోర్డ్ ఫిగో విషయానికి వస్తే.. ఇందులో 4-సిలిండర్, 4 స్ట్రోక్ 1.2 లీటర్ ఎమ్‌పిఎఫ్ఐ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ 1196 సీసీ సామర్థ్యాన్ని కలిగి ఉండి 6250 ఆర్‌పిఎమ్ వద్ద 71 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 102 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా స్విఫ్ట్ మాదిరిగానే 5-స్పీడ్ మ్యాన్యూల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. అయితే, మైలేజ్ విషయంలో మాత్రం ఫోర్డ్ ఫిగో పెట్రోల్ వేరియంట్ కొనుగోలుదారులను నిరుత్సాహపరుస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఇది ప్రతి లీటర్ పెట్రోల్‌కు 15.6 కి.మీ. మైలేజీనిస్తుంది.
మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








