మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ వర్సెస్ ఫోర్డ్ ఫిగో - పార్ట్ 1

మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ మార్కెట్లోకి విడుదలై, విజయవంతమైనప్పుడు ఆ సగ్మెంట్లోనీ కార్లన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయని చెప్పవచ్చు. అపూర్వ స్పందనతో ఏ హ్యాచ్‌బ్యాక్ కారు సాధించనట్లుగా లక్షకు పైగా బుకింగ్‌లను సొంతం చేసుకుంది. అయితే, అధిక డిమాండ్ కారణంగా, మార్కెట్ డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా లేకపోవడంతో కొత్త స్వఫ్ట్ డెలివరీ పీరియడ్ భారీగా పెరిగిపోయింది. దీంతో కొనుగోలుదారులు కూడా అంతంత సమయం వేచియుండలేక ఇదే సెగ్మెంట్లో ఇతర మోడళ్లవైపు మొగ్గుచూపుతున్నారు.

ఈ సెగ్మెంట్లో అందుబాటులో ఉన్న ఫోర్డ్ ఫిగో, మారుతి సుజుకి స్విఫ్ట్‌ల మధ్య వ్యత్యాసాలను, ఫీచర్లను పరీశీలించి రెండింటిలో ఏది బెస్టో ఒకసారి గమనిద్దాం..!!

మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ వర్సెస్ ఫోర్డ్ ఫిగో - డైమన్షన్:
ఫోర్డ్ ఫిగో కన్నా మారుతి స్విఫ్ట్ కాస్త వెడల్పుగానూ, పొడవుగానూ ఉంటుంది. మారుతి స్విఫ్ట్ 3850 మి.మీ. పొడవును, 1695 మి.మీ. వెడల్పును, 1510 మి.మీ. ఎత్తును మరియు 2430 మి.మీ. వీల్‌బేస్‌తో విశాలమైన ఇంటీరియర్స్, లార్జర్ బూట్‌స్పేస్‌ను కలిగి ఉంటుంది.

అదే ఫిగో విషయానికి వస్తే.. ఇది 3795 మి.మీ. పొడవును, 1680 మి.మీ. వెడల్పును, 1453 మి.మీ. ఎత్తును మరియు 2489 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే.. పొడవు, వెడల్పుల విషయంలో ఇక్కడ మారుతి సుజుకి స్విఫ్ట్‌దే పైచేయి అని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 25, 2011, 16:26 [IST]
English summary
Maruti Suzuki New Swift petrol variant is available at a price range of Rs.4.22 - 5.53 lakhs and Ford Figo petrol variant is available at a price range of Rs.3.69 - 4.67 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+