కొత్త స్విఫ్ట్‌లో కొత్త ఫీచర్లు ఏంటి...? - పార్ట్ 3

* పాత స్విఫ్ట్ కన్నా కొత్త స్విఫ్ట్ యొక్క హెడ్‌ల్యాంప్స్ పొడవుగా, పెద్దవిగా ఉన్నాయి. దీని వల్ల కారు మరింత ఆకర్షనీయంగా ఉండి ఎక్కువ స్పోర్టీ లుక్‌ను ఇస్తుంది.
* వెనుకవైపు ఉపయోగించిన టెయిల్-ల్యాంప్స్ కూడా ముందువైపు మాదిరిగానే, పాత స్విఫ్ట్ కన్నా కాస్తంత పెద్దవిగా ఉంటాయి. రాత్రి సమయాల్లో రివర్స్ గేర్‌లో వెళ్లాల్సి వచ్చినప్పుడు రోడ్డు స్పష్టంగా కనిపించేలా వీటికి క్లియర్ లెన్స్ ప్యానెల్‌ను అమర్చడం జరిగింది.
* ఇంకా బాడీ లైన్స్, ముందువైపు మరియు వెనుకవైపు ఉండే బంపర్స్, వెనుక డోరుకు ఉండే అద్దం, సెంట్రల్ ఎయిర్ డ్యామ్, రేడియేటర్ గ్రిల్ డిజైన్‌లలో కూడా మార్పులు చేర్పులు చేయడం జరిగింది.
కొత్త స్విఫ్ట్‌ను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం, అంటే ఆగస్టు 17న విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఆ రోజున కొత్త స్విఫ్ట్‌కు సంబంధించిన ధరలు తదితర మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించనుంది.


Click it and Unblock the Notifications








