కొత్త స్విఫ్ట్‌లో కొత్త ఫీచర్లు ఏంటి...? - పార్ట్ 2

* కొత్త స్విఫ్ట్ పొడవు - 3850mm, వెడల్పు - 1695mm, ఎత్తు - 1510mm, వీల్‌బేస్ - 2430mm.
* పాత స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్ కన్నా కొత్త స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్ 30 కేజీల బరువును తగ్గించబడింది. అలాగే, పాత స్విఫ్ట్ డీజిల్ వేరియంట్ కన్నా కొత్త డీజిల్ పెట్రోల్ వేరియంట్ 15 కేజీల బరువును తగ్గించబడింది. కారు ఛాస్సిస్ (బాడీ)లో చేసిన మార్పులు మరియు కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ఇంధన ట్యాంకులే ఇందుకు ప్రధాన కారణం.
* బూట్ సైజ్ (కారు వెనుకవైపు లగేజ్ పెట్టుకునే స్థలం)ను స్వల్పంగా పెంచడం జరిగింది.
* మరిన్ని అదనపు సౌకర్యాలతో కూడిన అత్యుత్తమ ఇంటీరియర్లు మరియు నాణ్యమైన ప్లాస్టిక్.
* కారు క్యాబిన్‌లో అమర్చబడిన పరికరాలు కంపెనీ అందిస్తున్న లగ్జరీ కారు కిజాషిని తలపిస్తాయి.
* స్టీరింగ్ వీల్, సెంటర్ కన్సోల్, ఏ/వి వెంట్స్, ప్లాస్టిక్స్ అన్నీ
కూడా సరికొత్తవి మరియు ప్రస్తుతం ఉన్న మోడల్ కన్నా మెరుగైనవి.
* మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ టాప్ ఎండ్ వేరియంట్‌లో స్టీరింగ్ అమర్చబడి ఉండే (స్టీరింగ్ మౌంటెడ్) కంట్రోల్స్ ఉంటాయి.
* అన్ని వేరియంట్లలోనూ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌పై కొత్తగా ఏర్పాటు చేసిన మల్టీ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే సిస్టమ్.
* హై-ఎండ్ వేరియంట్ స్విఫ్ట్ మోడళ్లలో సరికొత్త ఆడియో సిస్టమ్ మరియు క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్.


Click it and Unblock the Notifications








