టివి రియాల్టీ షోలోకి ప్రవేసించిన మారుతి సుజుకి రిట్జ్

రిట్జ్ జీలే యే పల్ కార్యక్రమాన్ని లిన్టాస్ మీడియా గ్రూపుకు చెందిన లిన్ టివి సహకారంతో రూపొందించారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 10 నుండి ఆరు వారాంతాలకు పైగా ప్రసారం కానుంది. ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా ఛీఫ్ జనరల్ మేనేజర్ మార్కెటింగ్ శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. "మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియో రిట్జ్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది.
యువ కుటుంబాల కోసం రూపొందించిన రిట్జ్, భారతీయ కొనుగోలుదారులు మరియు వారి కుటుంబాల్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. యువ కుటుంబాలతో మరింత మెరుగ్గా వ్యవహరించేందుకు ఈ కార్యక్రమం మాకు ఎంతగానో ఉపయోగపడగలదని ధీమాగా ఉన్నాం. అడ్వెంచర్ మరియు యాక్షన్‌లతో పాటుగా ఒక ఫ్యామిలీ కూర్చుని హాయిగా ఆనందించేందుకు రిట్జ్ జీలే యే పల్ ఓ మంచి ఫ్లాట్‌ఫామ్" అని చెప్పారు.


Click it and Unblock the Notifications








