బాండ్లపై సంతకం చేయమన్నందుకు సమ్మెకు దిగిన కార్మికులు

Workers Strike in Manesar
దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులు యాజమాన్యానికి మరియు కార్మికుల మధ్య యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం, కార్మికులను ప్లాంటులోకి అనుమతించాలంటే సత్ ప్రవర్తనతో ఉంటామనే బాండ్‌ (గుడ్ కండక్ట్ బాండ్‌)పై సంతకం చేస్తేనే అనుమతిస్తామని మారుతి యాజమాన్యం పట్టుబట్టింది.

ప్లాంటులో కొందరు కార్మికులు కావాలనే ఉత్పత్తుల నాణ్యతను దెబ్బతీస్తూ కంపెనీ ఆస్తులకు, పేరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారంటూ గుడ్ కండక్ట్ బాండ్ను కంపెనీ తెర మీదకు తీసుకువచ్చింది. అంతేకాకుండా.. ఇందుకు పాల్పడిన 10 మంది కార్మికులపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుని వారిని కంపెనీ సస్పెండ్ చేసింది. మరో ఐదుగురిని డిస్‌మిస్ చేసింది. ఆరుగురు తాత్కాలిక కార్మికులను సర్వీసుల నుంచి తొలగించింది.

కాగా.. సస్పెండ్ మరియు డిస్‌మిస్ అయి వారందరూ మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్ (ఎమ్ఎస్ఈయూ)కు చెందిన వారు కావడం గమనార్హం. దీంతో కార్మికులంతా ఏకమై ఉత్పత్తిని నిలిపివేశారు. ఫలితంగా సుమారు 1,200 యూనిట్ల ఉత్పత్తి నిలిచిపోయిందని, దీని వల్ల దాదాపు రూ.60 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. గడచిన జూన్‌లో కూడా కొత్త యూనియన్ విషయంలో ఈ ప్లాంటు కార్మికులు ఏకంగా 13 రోజులు నిరవధిక సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Tuesday, August 30, 2011, 10:32 [IST]
English summary
Maruti Suzuki India Limited (MSIL), India's largest carmaker has initiated stringent measures to improve quality of work at its plant in Manesar. MSIL has already suspended 10 workers and dismissed five workers after several quality issues were reported last week.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+